శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి వారికి తిరుమల దేవుని సత్కారం

  • courtesy : kidambi sethu raman

శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి వారికి తిరుమల దేవుని సత్కారం

శ్రీ అహోబిల క్షేత్రానికి,తిరుమల దేవాలయానికి వీడని  సంబంధం ఉంది. 108 దివ్యదేశాలలో
ఆంధ్ర దేశంలో ఉన్న రెండే రెండు దివ్యదేశాలు ఇవి.
తిరుమల శ్రీనివాసుడు అహోబిల లక్ష్మీ నృసింహుని ఆరాధకుడు.
అహోబిలేశ్వరులచే త్రిదండ సన్యాసములు పొందిన ఆదివన్ శఠగోప యతి తిరుమలకు సోపాన మార్గమును నిర్మించి,స్వామి వారికి నందనవనమును ఏర్పాటు చేశారు.
తిరుమల ఆలయ కవి అన్నమయ్య అహోబిల మఠం స్థాపనాచార్యులైన ఆదివన్ శఠగోప యతికి శిష్యులు.

ఇలా ఎన్నో విశేషాలు గల అహోబిల-తిరుమల క్షేత్రాల సంబంధం  నేడు సాకారమైనది.

శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పరంపర ధర్మకర్త,శ్రీ ఆదివన్ శఠగోప యతికి 46వ తరమైన అహోబిల మఠం ప్రస్తుత పీఠాధిపతి శ్రీ వణ్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికులు ఈ రోజు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అహోబిల మఠం శిష్యులతో కూడి మంగళాశాసనం చేశారు.

ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతి వారికి తిరుమల ఆలయ సంప్రదాయం ప్రకారం,టీటీడీ కార్యనిర్వహణాధికారి సమక్షంలో అర్చకులు మొదట ఇస్తకఫాల్ స్వాగతం పలికారు. స్వామివారి శఠారి ని పంచ ముద్రాత్మకంగా పీఠాధిపతి వారికి సమర్పించారు. అనంతరం పీఠాధిపతి వారు మహాద్వారం గూండా ఆలయంలోకి ప్రవేశించి,ధ్వజస్తంభం వద్ద నమస్కరించారు.అనంతరం సన్నిధిలోకి ప్రవేశించారు.కులశేఖర పడి వద్ద శ్రీ పీఠాధిపతి వారికి శేష వస్త్రం బహుకరించారు.
అనంతరం శ్రీ అహోబిల మఠం శిష్యులు  వెంకటేశ్వర స్వామి వారిని తమ ఆచార్యుల సమక్షంలో దర్శించుకున్నారు.అనంతరం శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి వారిని టీటీడీ అధికారులు ఛత్ర చామర గజ తురగాది సమస్త రాజోపచారములతో అహోబిల మఠానికి తీసుకుని వచ్చారు.అహోబిల మఠం వద్ద టీటీడీ ఈ.ఓ అశోక్ సింఘాల్,జే.ఈ.ఓ శ్రీనివాసరాజు లు శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి వారి ఆశీస్సులు అందుకున్నారు.

ఈ నెల 14న తిరుమల లో జరిగే అన్నమాచార్య వర్ధంతి మహోత్సవం లో శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి వారు ముఖ్యాధ్యక్షులుగా పాల్గొంటారు.
Sri Ahobila math peetaadhipathi honoured by tirumala sree venkateshwara

Ahobilam and tirumala are the only two divyadesams in andhra pradesh.
Lord venkateswara offered prayers to Ahobilam sri lakshmi narasimha swamy during his marriage.
The founder Peetaadhipathi of sri Ahobila math sri Adivan satagopa swamy constructed steps to tirumala hills and a nandanavanam.his disciple sriman Thallapaka Annamacharya is court poet of tirumala sri venteshwara.

In this regard,sri Ahobila math paramparaadheena sri Adivan satagopa yatheendra mahadesika Sri Lakshmi Narasimha swamy devasthaana parampara Dharma kartha, 46th jeer of sri Ahobila math sri van satagopa sri ranganatha yatheendra mahadesika swamy performed mangalasasanam to sri venkateswara .
Sri Peetaadhipathi is received with isthikaphal honours by ttd officials.perumal sri satari was given to Ahobila math peetaadhipathi with pancha mudra.
Srimadazhagiyasinger entered temple.at kuleshakara padi seshavastram was given to srimadazhagiyasinger.
later srimadazhagiyasinger was taken to sri Ahobila math with samasta raajopachaaram .
TTD E.O  ashok singhal and JEO srinivasaraju received phala mantrakshata of srimadazhagiyasinger.

Sri Ahobila math peetaadhipathi will attend vardhanthi mahothsavam of Sri Thallapaka Annamacharya on 14th march as a chief guest

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.