శ్రీశైల సత్రాల సేవలకు దేవస్థానం ఈ ఓ ప్రశంసలు

 శ్రీశైలదేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిన్నటి (14.03.2021) తో  పూర్తయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా  ఈ రోజు (15.03.2021) న  స్థానిక సత్రాల నిర్వాహకులను దేవస్థానం సత్కరించింది.

ఆలయ ప్రాంగణంలోని   అక్కమహాదేవి అలంకార మండపం లో కార్యనిర్వహణాధికారి  కె.ఎస్. రామరావు అధ్యక్షతన జరిగిన ఈ సత్కార కార్యక్రమం జరిగింది. పలు స్థానిక సత్రాల ప్రతినిధులు ఈ సమావేశం లో పాల్గొన్నారు.

 సమావేశ ప్రారంభంలో కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారన్నారు.భక్తులరద్దీకనుగుణంగా అన్ని సత్రాలు కూడా భక్తులకు వసతి, భోజన ఏర్పాట్లు చేయడంలో ఎంతో విశేష సేవలు అందిచాయన్నారు.ఈ సందర్భంగా అన్ని సత్రాల యాజమాన్యాలకు దేవస్థానం తరుపున కార్యనిర్వహణాధికారి  ధన్యవాదాలు తెలిపారు. దేవస్థానం సత్రాలకు పూర్తి సహాయ సహాకారాలను అందిస్దున్నారు. శ్రీశైలక్షేత్ర పవిత్రత కాపాడడంలో దేవస్థానం ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. ఈ విషయంలో సత్రాలు కూడా తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఇందుకోసం ఆయా సత్రాలలో వసతి, భోజనసదుపాయాలు పొందేవారికి అవగాహన కల్పించాలని సూచించారు.ముఖ్యంగా స్వచ్ఛ శ్రీశైలం పట్ల దేవస్థానం ప్రత్యేక శ్రద్ధకనబరుస్తోందని , ఈ విషయమై సత్రాల వారు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు. ముఖ్యంగా వ్యర్థాల నిర్వహణ పట్ల (వేస్ట్ మేనేజ్ మెంట్ పట్ల) జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సత్ర ప్రాంగణాన్ని పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలన్నారు.

అనంతరం శ్రీశైల సత్ర సంఘాల  సంక్షేమ సమాఖ్య అధ్యక్షులు  తాతిరెడ్డి ప్రసింగించారు.సమావేశం చివరలో సత్రాల ప్రతినిధులకు వేదాశీర్వచనముతో స్వామివార్ల శేషవస్త్రం, ప్రసాదాలు, ప్రశంసాపత్రం అందించారు.

 సమావేశంలో వసతివిభాగం సహాయ కార్యనిర్వహణాధికారి  డి. మల్లయ్య, ఆలయవిభాగం సహాయ కార్యనిర్వహణాధికారి  ఎం. హరిదాసు, వసతివిభాగం పర్యవేక్షకులు  జి. స్వాములు, వసతివిభాగం సీనియర్ అసిస్టెంట్  ఎం. మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed