శ్రీశైల మహా క్షేత్రంలో సంస్కృత భాష విర బూయాలి

శ్రీశైల దేవస్థానం:శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఉభయ దేవాలయాల వేదపండితులు, అర్చకులు, పరిచారకులకు,  సిబ్బందికి సంస్కృత భాష పరిజ్ఞానంపై అవగాహన కార్యక్రమం ఈ రోజు ( 22.01.2021) దేవస్థానం పరిపాలనా భవనంలో ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీ శ్రీ జగద్గురు పీఠాధిపతి డా. చెన్నసిద్ధరామ శివాచార్య మహాస్వామీజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.దేవస్థానం కార్యనిర్వహణాధికారి  కె.ఎస్.రామరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం లో సంస్కృత భారతి, శిక్షకురాలు శ్రీమతి కైప పద్మావతి,   కె. రామేశ్వరరావు దంపతులు శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమానికి ముందుగా అర్చకులు వేదపండితులు శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలను నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు.

 శ్రీ శ్రీ శ్రీ జగద్గురు పీఠాధిపతి డా. చెన్నసిద్ధరామ శివాచార్య మహాస్వామీజీ మాట్లాడుతూ మన భారతీయ భాషలన్నింటికి మూలం సంస్కృతమని అన్నారు. సంస్కృతాన్ని మాతృభాష, అమృతభాష అని అన్నారు.మనభారతీయ భాషలలోనే కాకుండా పలు ఇతర భాషలలోని ఎన్నో శబ్దాల మూలాలు సంస్కృత భాషలో ఉండడం విశేషమన్నారు.అన్ని భాషలకు మూలం మన సంస్కృత భాష అని, మన సంస్కృతి సంప్రదాయాలకు మూలం సంస్కృత వాజ్మయమన్నారు. సంస్కృతాన్ని అందరు సరళంగా మాట్లాడి  ఎవరికివారు సంస్కరింపబడుతారని తెలిపారు.శ్రీశైలక్షేత్రం సిద్ధ క్షేత్రమని అన్నారు. ఈ క్షేత్రం సాక్షాత్తు మోక్షక్షేత్రం అని కూడా అన్నారు. దేవాలయాలలో పనిచేసే అర్చకులు మొదలుకొని అందరు సంస్కృతంలో మాట్లాడి సంస్కృతవాతావరణాన్ని తీసుకురావాలన్నారు.

 కార్యనిర్వహణాధికారి  కె.ఎస్.రామరావు  మాట్లాడుతూ భారతదేశంలో  అతి పురాతనమైన భాష సంస్కృతమని అన్నారు. అన్ని ప్రధాన భాషలకు సంస్కృతమే తల్లివంటిదనే మాట ఎంతో ప్రసిద్ధమని చెబుతూ సంస్కృతం అంటే ఒకచోట చేర్చబడినదని, బాగా సంస్కరించబడినదని, ఎలాంటి లోపాలు లేనిదని, అనంతంగా విస్తరించబడినది అని అర్థాలు ఉన్నాయన్నారు. వేదవాజ్మయం తరువాత సంస్కృత భాషలో వచ్చిన మార్పులకు అద్దం పట్టేవి ఉపనిషత్తులని, వేదాలలోని సంస్కృతభాష ఆ తరువాత వచ్చిన ఉపనిషత్తులలో కొంత మార్పులను సంతరించుకున్నవని పేర్కొన్నారు.

 శ్రీశైలక్షేత్రంలో ఒకప్పుడు పంచమఠాలు విద్యాకేంద్రాలుగా ఉండేవన్నారు.ధార్మిక సంస్థలైన ఆలయాలలో విధులు నిర్వర్తించే అర్చక, పరిచారకులతో పాటు సిబ్బంది అందరు కూడా సంస్కృతంపై అవగాహన కల్పించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.అందుకే సిబ్బంది నైపుణ్యాభివృద్ధి చర్యలలో భాగంగా ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేశామన్నారు. సిబ్బంది అందరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలుపుతూ శ్రీశైలక్షేత్రాన్ని సంస్కృత కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు.

అనంతరం శ్రీమతి కైప పద్మావతి  మాట్లాడుతూ శ్రీశైలక్షేత్రంలో శిక్షణ ఇవ్వడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. 10 రోజులలో సంస్కృత భాషలో సులభంగా మాట్లాడటానికి సంస్కృతిభారతి ద్వారా ఏర్పాటు చేసిన సంస్కృత సంభాషణ శిబిరంలో పాల్గొని ప్రతి ఒక్కరు సంస్కృతంలో మాట్లాడుతూ క్షేత్రాన్ని సంస్కృ క్షేత్రంగా విరసిల్లేలా చేయాలనే ప్రయత్నంలో తమ వంతు సహకారాన్ని అందిస్తానన్నారు. ఈ అవకాశాన్ని కల్పించినందులకు కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామరావు కు  కృతజ్ఞతలు తెలుపుతున్నాన్నారు.

 ఈ శిక్షణా తరగతులు మల్లికార్జున సదన్ లో  10 రోజులపాటు 31.01.2021 వరకు జరుగనున్నాయి.ఇందులో భాగంగా ఉదయం 10.30 గంటల నుండి 11.30 గంటల వరకు , సాయంత్రం 4.30 గంటల నుండి 5.30 గంటలవరకు ఈ శిక్షణా తరగతులను నిర్వహిస్తారు.

* M.Mogili Goud, Habsiguda, Hyderabad donated Rs.Five Lakhs For Kuteera Nirmana Pathakam.

*Ankaalamma special puuja and Uuyala seva performed in the temple by Archaka swaamulu.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.