శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వాతావరణం  ఉట్టిపడేలా కైలాసద్వారం వద్ద ఏర్పాట్లు-ఈ ఓ ఆదేశం

 శ్రీశైల దేవస్థానం:   శ్రీశైల దేవస్థానం  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పాదయాత్ర భక్తుల సౌకర్యార్థం కైలాసద్వారం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు .  04.03.2021 నుండి 14.03.2021 వరకు 11 రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.ముఖ్యంగా శివదీక్షా భక్తులతో పాటు, సాధారణ భక్తులు కూడా కాలిబాట మార్గములో క్షేత్రాన్ని సందర్శిస్తారు.

పాదయాత్ర భక్తులు వెంకటాపురం, బైర్లూటి, నాగలూటి, దామర్లకుంట, పెచ్చెర్లు, భీముని కొలను, కైలాసద్వారం మీదుగా  క్షేత్రానికి చేరుకుంటారు.

ఈ కారణంగా భక్తుల సౌకర్యార్థం కాలిబాట మార్గములో పలు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.అటవీశాఖ సహకారంతో ఈ ఏర్పాట్లను చేస్తున్నారు.

ఈ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఈ రోజు (21.02.2021) న  కార్యనిర్వహణాధికారి కే. ఎస్ .రామ రావు  సంబంధిత ఇంజనీరింగ్ విభాగ అధికారులతో కలిసి కైలాసద్వారం , భీమునికొలను మెట్ల మార్గ ప్రదేశాన్ని పరిశీలించారు.  కైలాసద్వారం వద్ద భక్తులు సేద తీరేందుకు చలువపందిర్లను (పైప్ పెండాల్స్) తాత్కాలిక షెడ్డును ఏర్పాటు చేయలని   కార్యనిర్వహణాధికారి ఆదేశించారు . వెంటనే పనులను ప్రారంభించాలన్నారు. కైలాసద్వారం నుండి భీమునికొలను వరకు తాత్కాలికంగా పైప్లాన్ వేసి నీటి సరఫరాను కల్పించాలన్నారు. కైలాసద్వారం – భీమునికొలను మధ్యమార్గములో 1000 లీటర్ల సామర్థ్యం గల సింటెక్స్ ట్యాంకులను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మార్గములో 5 చోట్ల ఈ ట్యాంకులను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. కైలాసద్వారం వద్ద 5000 సామర్థ్యం గల సింటె ్యంకులను ఏర్పాటు చేయాలన్నారు. కనీసం అయిదారు ట్యాంకులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఈ సింటెక్స్ ట్యాంకులకు,  కైలాసద్వారం వద్ద గల 20 వేల లీటర్ల సామర్థ్యపు ఆర్.సి.సి నీటి ట్యాంకునకు కూడా నిరంతర మంచినీటి సరఫరా చేస్తుండాలన్నారు.మొత్తం మీద కైలాసద్వారంలో నిరంతరం 50వేల . లీటర్ల నీరు నిల్వ వుండేవిధంగా ప్రణాళికలను రూపొందించి, తదనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు.

 కైలాసద్వారం వద్ద జనరేటర్ ఏర్పాటు చేసి తాత్కాలిక విద్యుద్దీకరణ ఏర్పాటు చేయాలని కార్యనిర్వహణాధికారి  ఆదేశించారు. ఉత్సవ వాతావరణం  ఉట్టిపడేవిధంగా కైలాసద్వారం వద్ద తాత్కాలిక స్వాగతతోరణం కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.భీమునికొలను,  కైలాసద్వార ప్రాంతాలలో అన్నదానం చేసే దాతలకు దేవస్థానం సక్షాన పూర్తి సహాయ సహాకారాలను అందజేయాలని ఆదేశించారు.

ఈ పరిశీలనలో డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, నీటిసరఫరా సహాయ ఇంజనీర్ రాజేశ్వరరావు, సహాయ స్థపతి జవహర్ తదితరులు పాల్గొన్నారు. అటవీశాఖ ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎం.వి. నరసింహులు కూడా ఈ పరిశీలనలో పాల్గొన్నారు.

*శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాదవితరణ పథకానికి చెక్కు రూపంలో రూ.1,00,008/- విరాళంగా సమర్పించిన హైదరాబాద్ వాస్తవ్యులు తల్లపనేని శ్రీనివాసులు.*  Smt B.Aruna Devi and B.Muralidhar , Hyderabad donated  Rs.1,00,116/- For Annadhaanam scheme in the temple. *  అన్నప్రసాదవితరణ పథకానికి రూ.1,,01,116/- విరాళంగా సమర్పించిన హైదరాబాద్ వాస్తవ్యులు  Dr. మంజుల అనగని..కుటుంబ సభ్యులు.

print

Post Comment

You May Have Missed