శ్రీశైల ద్వార క్షేత్రాలలో గురువారం నుంచి విశేష పూజలు నిర్వహిస్తారు .26 న ప్రకాశం జిల్లా త్రిపురాంతకం, 27 న కడప జిల్లా సిద్దవటం, 28 న తెలంగాణ రాష్ట్ర అలంపురం. 29 న నాగర్ కర్నూలు జిల్లా ఉమామహేశ్వరం, ౩౦ న శ్రీశైలం లో శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహిస్తారు . శ్రీశైల క్షేత్రానికి నేరుగా రోడ్డు మార్గం లేని పూర్వపు రోజుల్లో ఈ నాలుగు క్షేత్రాల మీదుగా భక్తులు శ్రీశైలం చేరుకునేవారు . ఫలితంగా ఈ నాలుగు శ్రీశైల ద్వారా క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి . నాడు ఋషులు, మునులు , మహనీయులు ఈ ద్వార క్షేత్రాలలో స్వామి అమ్మవార్లను సేవించి అనంతరం శ్రీశైలంలో స్వామి అమ్మవార్లను దర్శించేవారని చెబుతారు . ఈ సంప్రదాయాన్ని అనుసరించి శ్రీశైల దేవస్థానం వారు ఏటా ఈ చాతుర్ద్వార పూజలు నిర్వహిస్తున్నారు .