×

 శ్రీశైల దేవస్థాన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించిన వారిపై చట్టపరంగా చర్యలు-ఈ ఓ

 శ్రీశైల దేవస్థాన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించిన వారిపై చట్టపరంగా చర్యలు-ఈ ఓ

గో ఉత్పత్తుల విక్రయాలు ప్రారంభం:

 శ్రీశైల దేవస్థానం:సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా దేవస్థానం గో సంరక్షణశాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం దాదాపు 1300పైగా గోవులు దేవస్థానం  ఆధ్వర్యంలో పోషణ జరగుతోంది.కాగా మన సంస్కృతి సంప్రదాయాలలో గోవుకు గల ప్రాధాన్యాన్ని మరింతగా భక్తులకు తెలియజెప్పేందుకు దేవస్థానం పలు గో ఉత్పత్తుల విక్రయాన్ని ప్రారంభించింది.దేవస్థానం నిర్వహిస్తున్న గణేశ గోశాల (హేమారెడ్డి మల్లమ్మ ఆలయం) వద్ద ఈ రోజు ప్రత్యేకంగా విక్రయకేంద్రం ప్రారంభమైంది. ఇప్పటికే ప్రసాదాల విక్రయ కేంద్రాల ప్రాంగణములో ఈ గో ఉత్పత్తులు విక్రయమవ్తున్నాయి. గోమూత్రాన్ని సేకరించి,మరగపెట్టి, ఆ ఆవిరిని చల్లార్చడం వలన తయారు చేయబడిన గో అర్క్,గోమయంతో చేయబడిన ధూప్ స్టిక్స్, మోబైల్ యాంటీ రేడియేషన్ స్టిక్కర్, హోమానికి ఉపయోగించేందుకు  గోమయంతో చేయబడిన హోమపిడకలు,వైదిక కార్యక్రమాలలో పుణ్యాహవచనం వంటి శుద్ధికార్యాలలో వినియోగించేందుకు ఆవుపంచకం మొదలైనవి విక్రయకేంద్రములో భక్తులకు అందుబాటులో ఉంచారు.

ఈ విక్రయాల ప్రారంభ కార్యక్రమంలో గోశాల పర్యవేక్షకురాలు శ్రీమతి సాయికుమారి, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

ఏ మాత్రమూ వాస్తవం లేదు:

ఇటీవల ” శ్రీశైల దేవస్థానం పరిస్థితి ఏంటి” అనే శీర్షికతో సామాజిక మాధ్యమాలలో వచ్చిన వార్తలో ఏ మాత్రమూ వాస్తవం లేదని ఈ ఓ వివరించారు.

దేవస్థానం విరాళాల పథకములోని డోనర్ కాటేజి నిర్మాణానికి ప్రైవేటు సంస్థ అయిన ఫోనెక్స్ గ్రూప్ కంపెనీ ప్రభుత్వం అనుమతిని పొందిందని,  ఈ నిర్మాణ బాధ్యత నిర్మాణదాతలైన కంపెనీవారిదేనని , దేవస్థానం నిధులు ఈ నిర్మాణానికి వెచ్చించరని  వివరించారు. ఈ కాటేజీ నిర్మాణం పూర్తయిన పిదప విరాళాల పథక నిబంధనల మేరకు కాటేజీని  దేవస్థానానికి అప్పగిస్తారు, నిర్మాణ కాంట్రాక్టరును దేవస్థానం నియమించదని పేర్కొన్నారు. గోశాలలో పర్యవేక్షక బాధ్యతలను అన్యతమతానికి చెందిన అధికారిణి నిర్వహిస్తుందనడములో కూడా ఏ మాత్రము వాస్తవం లేదన్నారు.

కేవలం శ్రీశైలక్షేత్ర పేరు ప్రఖ్యాతులకు భంగం కలగాలనే దురుద్దేశముతో సత్యదూరమైన ఈ వార్తను సామాజిక మాధ్యమాలలో కొందరు ప్రచారాన్ని కల్పిస్తున్నట్లుగా దేవస్థానం భావిస్తోంది. భక్తులందరూ వాస్తవాలను గ్రహించి, ఇటువంటి వదంతులను నమ్మవద్దని పత్రికా ముఖంగా ఈ ఓ వివరించారు .ఇటువంటి నిరాధారమైన ఆరోపణలతో దేవస్థాన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని దేవస్థానం నిర్ణయించిందని  చెప్పారు.

print

Post Comment

You May Have Missed