శ్రీశైల దేవస్థానం: కొవ్వూరి సాహితి, రాజమండ్రి ఈ రోజు దేవస్థానానికి రెండు వెండిపళ్లెములను విరాళంగా సమర్పించారు.
2 కేజీల 20 గ్రాముల బరువుగల ఈ పళ్లెముల విలువ సుమారు రూ. 1,30,000/-లు దాకా ఉంటుందని దాత తెలిపారు.
శ్రీస్వామిఅమ్మవార్ల కైంకర్యాలలో వినియోగించేందుకు ఈ పళ్లెములను సమర్పించినట్లుగా దాతలు తెలియజేశారు.
అమ్మవారి ఆలయ ప్రాంగణములోని ఆశీర్వచన మండపంలో ఈ వెండిపళ్లెములను కార్యనిర్వహణాధికారి కి అందించారు.
ఈ సందర్భంగా దాతకు సంబంధిత రశీదు, శ్రీస్వామి అమ్మవార్ల ప్రసాదం, శేషవస్త్రాలు అందించారు.
ఈ సమర్పణ కార్యక్రమములో వేదపండితులు గంటి రాధకృష్ణ శర్మ, అధ్యాపకులు ఎం. పూర్ణానందరం, అమ్మవారి ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
*Kumaara Swamy Puuja,Bayalu Veerabhadra Swamy Puuja,Nandheeswara Puuja performed in the temple today. E.O. participated in couple of events. Archaka swaamulu performed the puja.