శ్రీశైల దేవస్థానం: “శివతత్వం” పై శ్రీశైల దేవస్థానం ప్రముఖ ప్రవచకులైన బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి ప్రవచనం
ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా శ్రీశైల దేవస్థానం ప్రముఖ ప్రవచకులైన బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి వారిచే “శివతత్వం” అనే అంశంపై ప్రత్యేక ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేసింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని హరిహరరాయ గోపురం వద్ద గల శ్రీ భ్రామరీ కళావేదికపై సాయంకాలం గం. 6:30 ని||లకు ఈ ప్రవచన కార్యక్రమం మొదలైంది. .
ఇందులో భాగంగా ప్రవాచకుల వారు శివలీలలు, శివమహత్మ్యం , శివతత్త్యంలోని అంతరార్థాలు, శివరూప విశేషాలు మొదలైన అంశాలతో పాటు పలువురు శివభక్తుల గాథలను వినిపించారు.
అదేవిధంగా త్రిమూర్తులలో ఎటువంటి భేదాలు లేవని, శివకేశవులు సమానమని,ఈ జగమంతా శివానుభూతిని కలిగి ఉన్నదని అందుకు నిదర్శనమే ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు అన్నారు.
ఆ దేవదేవుని ఎవరైనా కూడా, వారి శక్తి కొద్దీ పండును కానీ, పువ్వును కానీ, కనీసం నీటినైన భక్తితో సమర్పించవచ్చున్నారు.
జ్యోతిర్లింగ స్వరూపమైన శ్రీ మల్లికార్జునస్వామి, శక్తి పీఠమైన శ్రీ భ్రమరాంబదేవి స్వయంగా వెలసిన శ్రీశైలక్షేత్రం సాక్షాత్తు ఇలలో వెలసిన కైలాసమన్నారు. సకల దేవతలు కూడా ప్రతి నిత్యం మల్లికార్జునస్వామిని సేవిస్తుంటారు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే శ్రీశైలక్షేత్ర దర్శనభాగ్యం కలుగుతుందన్నారు.
సకల తత్యాల స్వరూపమే శివతత్త్వము.. సర్వాంతర్యామి అయిన పరమశివుడు నిరాకారుడు అని, శ్రీశైల మల్లికార్జునస్వామిని కేవలం ఒక్కసారి దర్శించినంత మాత్రానే సకల తీర్థాలలో పున్యస్నానం చేసిన ఫలం లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయన్నారు.
పరమశివుడు, మానవులకే కాకుండా జంతుజీవరాసులకు కూడా కటాక్షించాడని, అందుకు “శ్రీకాళహస్తి” గాధ నిదర్శనమన్నారు.
అదేవిధంగా వారు భక్తుల కథలను చెప్తూ మార్కండేయ గాధను, భక్త కన్నప్ప కథను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా వారు త్రిమూర్తులలో ఎటువంటి భేదాలు లేవన్నారు. అదేవిధంగా శివకేశవుల మధ్య కూడా సమానమని గుర్తించాలన్నారు.
ఈ జగమంతా శివశక్తుల స్వరూపమే అన్నారు. అందుకు నిదర్శనమే ద్వాదశ జ్యోతిర్లింగాలు, ఆష్టాదశ శక్తిపీఠాలు అన్నారు.
ఈ ప్రసంగంలో వీరు వైదిక ఆచారాలు, సాంప్రదాయాలు మొదలైన అంశాలను ప్రస్తావించారు.