×

శ్రీశైల దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం వైఎస్‌ జగన్ కు అధికారిక ఆహ్వానం

శ్రీశైల దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం వైఎస్‌ జగన్ కు అధికారిక ఆహ్వానం

అమరావతి:క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ  సీఎం  వైఎస్‌ జగన్‌ను కలిసి శ్రీశైల దేవస్ధానం, (శ్రీశైలం) మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు   ఆహ్వానించిన          దేవాదాయశాఖ మంత్రి వి. శ్రీనివాసరావు, ఈవో కే.ఎస్‌. రామ రావు.04.03.2021 నుంచి 14.03.2021 వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు, క్యాలెండర్‌ అందజేసి వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చిన వేదపండితులు.

శ్రీశైల క్షేత్ర మహిమా విశేషాలతో ప్రచురించిన శ్రీశైలఖండం పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి.

శ్రీశైల గిరి ప్రదక్షిణ: 

శ్రీశైలదేవస్థానం:మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని దేవస్థానం ఈ రోజు సాయంత్రం (26.02.2021) శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించింది.ఈ రోజు సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల కు  మహామంగళహారతుల అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను “పల్లకీలో వేంచేబు చేయించి ప్రత్యేకపూజలు జరిపారు. తరువాత శ్రీస్వామి అమ్మవార్ల పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరిప్రదక్షిణ ప్రారంభమయింది.

ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, గంగాసదనం, బయలువీరభద్రస్వామి ఆలయం, వలయరహదారి మీదుగా ఫిల్టర్ బెడ్, సిద్ధిరామప్పకొలను, పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడి నుండి తిరిగి నందిమండపం వద్దకు , నందిమండపం నుండి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోవడంతో ఈ గిరిప్రదక్షిణ ముగిసింది.

 శ్రీశైలగిరిప్రదక్షిణ ఎంతో ప్రాశస్త్యం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగం లో శ్రీరాముడు త్రిపురాంతకం, సిద్ధవటం, ఉమామహేశ్వరం, అలంపురం మొదలైన ద్వార క్షేత్రాలగుండా గిరిప్రదక్షిణ ఆచరించినట్లు శ్రీశైలఖండం చెబుతోంది.

శ్రీశైలక్షేత్రములోని ప్రాచీనమఠాలను, ఆలయాలను భక్తులచేత దర్శింపజేయిస్తూ వారిలో భక్తిభావాలను మరింతగా పెంపొందింపజేయాలని, అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ గిరిప్రదక్షిణను నిర్వహిస్తున్నారు.

గిరిప్రదక్షిణ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేసారు.

 దేవస్థానం కార్యక్రమాలను అధ్యయం చేసిన ఉజ్జయిని ఆలయ కమిటీ:

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహంకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయ కమిటీ బృందంవారు శ్రీశైలానికి విచ్చేసి దేవస్థానం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఈరోజు (26.02.2021) న  అధ్యయనం చేశారు.

ఈ కమిటీబృందంలో మహాకాళేశ్వర ఆలయ మేనేజ్ మెంట్ పరిపాలనా అధికారి,  ఉజ్జయిని అదనపు జిల్లా మెజిస్టేట్  నరేంద్రకుమార్ సూర్యవల్లీ, ఐఏఎస్, ఉజ్జయినీ స్మార్ట్ సిటి లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి,  ఉజ్జయిని అడిషనల్ కలెక్టర్  జితేంద్ర సింగ్ చౌహన్, ఉజ్జయిని నగర అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  అమరేందర్ సింగ్, మహంకాళేశ్వర ఆలయ అర్చకులు ఆశీష్ శర్మ, ప్రదీప్ శర్మ, ఉజ్జయిని పౌరవిభాగ ప్రతినిధి  విశాల్ తదితర సిబ్బంది ఉన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉజ్జయిని మహంకాళేశ్వర ఆలయములో భక్తుల సౌకర్యార్థం వివిధ సౌకర్యాల విస్తరణ చేపట్టామని , సౌకర్యాల కల్పన అవగాహన కార్యక్రమములో భాగంగా శ్రీశైల దేవస్థానం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల అధ్యయానికి వచ్చామన్నారు.

ఆలయంలో క్యూలైన్ల నిర్వహణ, అతిశీఘ్రదర్శన, శీఘ్రదర్శన , ఆర్జితసేవా కౌంటర్ల నిర్వహణ, ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిర్వహణ, ఆర్జితహోమాల నిర్వహణ, పరోక్ష ఆర్జిత సేవల నిర్వహణ, లడ్డూ ప్రసాదాల తయారీ, లడ్డుప్రసాదాల విక్రయకేంద్రాలు, అన్నప్రసాదవితరణ మొదలైన వాటిని ఉజ్జయిని బృందంవారు పరిశీలించారు.

*  I. Satyanarayana Murthy, Nellore donated Rs.One Lakh For Annadhaanam scheme in the temple.

*Ankaalamma Vishesha Puuja,Uuyala seva performed in the temple.

print

Post Comment

You May Have Missed