శ్రీశైల దేవస్థానం అన్నదాన భవనం లో అన్నప్రసాద వితరణ పున: ప్రారంభం

శ్రీశైల దేవస్థానం: రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్   ఉత్తర్వుల మేరకు ఈ రోజు  (04.02.2021) నుంచి అన్నదాన భవనం లో అన్నప్రసాద వితరణ పున: ప్రారంభమైంది.ఈ ఉదయం  గం. 10.30 ల నుంచి అన్నదాన భవనములో ఈ వితరణను ప్రారంభించారు.

గతం లో మాదిరిగానే ప్రతిరోజు కూడా ఉదయం గం. 10.30ల నుంచి మధ్యాహ్నం గం.3.00ల వరకు ఈ అన్నప్రసాద వితరణను ఉంటుంది.

కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ప్రతిరోజు కూడా సమయపాలనను పాటిస్తూ అన్నప్రసాద వితరణను జరపాలని సిబ్బందిని ఆదేశించారు. భక్తులందరితో కూడా మర్యాదగా మెలగాలని సూచించారు.  ఎప్పటికప్పుడు అన్నప్రసాద వితరణ స్వీకరించే భక్తులతో సంభాషిస్తూ వారి అభిప్రాయాలను తీసుకుంటుండాలని అన్నప్రసాదవితరణ విభాగ అధికారులకు సూచించారు.

 కోవిడ్ నిబంధనలను పాటించడం పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తుండాలని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.

అన్నదాన క్యూలైన్లలో భక్తులందరు  మాస్కులు ధరించేవిధంగా మైకుద్వారా అవగాహన కల్పిస్తున్నారు.  భక్తులందరు  భౌతికదూరాన్ని పాటించాలని కూడా సూచిస్తున్నారు .భక్తులు చేతులు శుభ్రపరుచుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసారు .

భక్తుల భోజనాలు పూర్తయ్యాక వారు చేతులు కడిగే ప్రదేశములో కూడా భౌతికదూరం పాటించే విధంగా చర్యలు చేపట్టారు . ఇందుకోసం ఒక కుళాయికి మరొక కుళాయికి మధ్య తగినంత దూరం ఉండే విధంగా నీటి సరఫరా కల్పించారు.

 అన్నదానం క్యూలైన్లను, క్యూలైన్ల పైపులను,అన్నదానభవనములోని కటాంజాలను, రైలింగులు మొదలైన వాటిని నిర్ణీత సమయాలలో శాస్త్రీయ పద్ధతిలో శానిటైజేషన్ చేస్తున్నారు.

లాక్ డౌన్ సమయం లో స్థానికంగా ఉండే సాధువులకు, నిరాశ్రయులకు అన్నపొట్లాల ద్వారా అన్నప్రసాదాలను అందించారు.

 దర్శనాలు ప్రారంభమైనప్పటి నుండి భక్తులకు పులిహోర, పెరుగన్నం, సాంబారన్నం, కదంబ ప్రసాదం మొదలైనవి పొట్లాల రూపములో భక్తులకు అందించారు.ఈ రోజు  (04.02.2021) నుంచి అన్నదాన భవనం లో అన్నప్రసాద వితరణ పున: ప్రారంభమైంది.

*Datthathreya Swamy Puuja  performed in the temple.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.