శ్రీశైల దేవస్థానంలో సామవేదం ప్రవచనం ప్రారంభం

శ్రీశైల దేవస్థానంలో గురువారం సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనాలు ప్రారంభమయ్యాయి . హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా దేవస్థానం 11 రోజులపాటు శివానందలహరి పై సామవేదం వారి ప్రవచనాలకు ఏర్పాట్లు చేసింది .ముందుగా దేవస్థానం ఈ ఓ శ్రీరామచంద్రమూర్తి  ఆలయ రాజగోపురం వద్ద  ప్రవచనకర్త సామవేదం వారిని సాదరంగా ఆహ్వానించారు . శ్రీశైల క్షేత్రం గొప్ప సిద్ధ స్థలం ,తపోభూమి యని సామవేదం కీర్తించారు. ఆదిశంకరులు రచించిన అనేక విశిష్ట గ్రంధాలలో శివానందలహరి ఎంతో ప్రత్యేకం అన్నారు. ఈ ఉత్కృష్ట కావ్యాన్ని వారు ఇక్కడి పాలధార-పంచధార లో రచించారని వివరించారు. ఈ క్షేత్రం ఇలలో కైలాసమన్నారు. శివానందలహరి భక్తి శాస్త్రం , శివశాస్త్రమని చెప్పారు. లోకకల్యాణం కోసం నందిసేవ ప్రారంభించడం ముదాహవమని సామవేదం అభినందించారు.

print

Post Comment

You May Have Missed