శ్రీశైల దేవస్థానంలో వేగవంతంగా సౌండ్ అండ్ లైట్ షో పనులు

శ్రీశైల దేవస్థానం:భారత ప్రభుత్వ ప్రసాద్ (PRASAD-Pilgrimage Rejuvenation And Spiritual Augmentation Drive) పథకంలో భాగంగా చేపట్టిన  – సౌండ్ అండ్ లైట్ షో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.ఈ రోజు 18 న కార్యనిర్వహణాధికారి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఈ పనులను సమీక్షించారు.ఆలయప్రాంగణములో వాయువ్యభాగాన (నాగులకట్ట వెనుకభాగములో) ఈ సౌండ్ అండ్ లైట్ షోను ఏర్పాటు చేసారు.

సుమారు 40 నిమిషాల నిడివిగల ఈ ప్రదర్శనలో జ్యోతిర్లింగ క్షేత్రాల పరిచయం, అష్టాదశ శక్తిపీఠాల పరిచయం, శ్రీశైలక్షేత్ర ప్రాశస్త్యం, శిలాద మహర్షి కుమారుడైన పర్వతుడు తపస్సుతో శివుని మెప్పించి పర్వత అకారాన్ని పొంది శ్రీపర్వతంగా మారడం, శ్రీపర్వతంపై పరమేశ్వరుడు శ్రీపర్వతస్వామిగా స్వయంగా కొలువుదీరడం, కాలక్రమములో శ్రీపర్వతం శ్రీశైలంగాను, శ్రీపర్వతస్వామి మల్లికార్జునస్వామిగా పిలువబడటం, ఆదిపరాశక్తి భ్రమర (తుమ్మెద) రూపాన్ని ధరించి అరుణాసురుడిని సంహరించి శ్రీశైలంలో భ్రమరాంబాదేవిగా అవతరించడం, చంద్రవతికథ, శ్రీశైలములో ఆదిశంకరుల వారు తపస్సు, అక్కమహాదేవి వృత్తాంతం, శ్రీశైలములో అక్కమహాదేవి తపస్సు ఆచరించడం, కదళీవనములో సిద్దిపొందడం, శ్రీశైల

చారిత్రక విశేషాలు మొదలైన అంశాలతో ఈ ప్రదర్శన రూపొందించారు.

print

Post Comment

You May Have Missed