శ్రీశైల దేవస్థానంలో ముగిసిన గణపతి నవరాత్రోత్సవాలు

 శ్రీశైల దేవస్థానం: వినాయకచవితిని పురస్కరించుకుని ఆగస్టు 22వ తేదీన ప్రారంభమైన గణపతి నవరాత్రోత్సవాలు ఈ రోజు తో ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీ స్వామివారి యాగశాలలో పూర్ణాహుతి జరిగింది.

ఈ ఉత్సవాలలో ప్రతిరోజు రత్నగర్భగణపతిస్వామివారికి, సాక్షిగణపతిస్వామివారికి, సాక్షిగణపతి ఆలయములో నెలకొల్పిన మృత్తికాగణపతికి వ్రతకల్పపూర్వక పూజలు, మండపారాధనలు, ఉపనిషత్ పారాయణలు, జపానుష్ఠానాలు, గణపతిహోమం, రుద్రహోమం, సాయంకాలపూజలు జరిపారు.పూర్ణాహుతి కంటే మందుగా స్వామివారి ఆలయములోని రత్నగర్భగణపతి స్వామివారికి అలాగే సాక్షిగణపతిస్వామివారికి, మృత్తికా గణపతివారికి ప్రత్యేక పూజలు జరిపించబడ్డాయి. ఈ పూజల తరువాత యాగశాలలో నెలకొల్పబడిన పంచలోహ వరసిద్ధి వినాయకస్వామివారికి కూడా విశేష పూజలు జరిగాయి.

అనంతరం లోకకల్యాణం కోసం జపాలు, నిత్యహోమ బలిహరణలను చేసి గణపతి హోమం, రుద్రహోమం,

జయాదిహోమం జరిపారు. తరువాత పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృథం కార్యక్రమాలు జరిగాయి.

నారికేళాలు పలు సుగంధద్రవ్యాలు, ముత్యం, పగడం, వెండి నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసారు.

తరువాత జరిగిన అవబృథంలో వరసిద్ధి వినాయకస్వామి పంచలోహమూర్తికి ఆలయ ప్రాంగణంలో గల మల్లికాగుండంలో  స్నపన కార్యక్రమం నిర్వహించారు.

అదేవిధంగా ఉత్సవరోజులలో సాక్షిగణపతి ఆలయంలో కూడా ప్రతిరోజూ హోమాలు, జపాలు, పారాయణలు జరిగాయి.

| మృత్తికా గణపతికి నిమజ్జనోత్సవం |

గణపతి నవరాత్రతోత్సవాల సందర్భంగా సాక్షిగణపతి ఆలయంలో నెలకొల్పబడిన మృత్తికా గణపతిస్వామి వారికి ఈ రోజు 31న  నిమజ్జనోత్సవం జరిగింది.

నిమజ్జనోత్సవానికి ముందు అర్చకస్వామలు గణపతికి విశేషంగా పూజాదికాలను జరిపించారు. తరువాత లింగాలగట్టులో నిమజ్జనోత్సవం జరిగింది. 

మృత్తికా గణపతికి సమర్పించిన లడ్డు ప్రసాదాన్ని గతములో బహిరంగ వేలము వేయడం జరుగుతుండేది. ఈ ఏడాది ఈ లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా పంచిపెట్టారు.

కాగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ నిమజ్జనోత్సవం జరిగింది.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.