శ్రీశైల దేవస్థానం ఏర్పాటు చేసిన భజన శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది . హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఈనెల ఒకటో తేదీన ఈ కార్యకమం తరగతులు ప్రారంభమయ్యాయి . కర్నూలు , ప్రకాశం జిల్లాల నుంచి మొత్తం 20 మందిని ఎంపిక చేసారు .శిక్షణ పూర్తి చేసిన వారికి దేవస్థానం ఈ ఓ శ్రీరామచంద్ర మూర్తి ఈరోజు కార్యక్రమంలో శ్రీస్వామి వార్ల శేష వస్త్రాన్ని , ప్రసాదాన్ని అందచేసారు . శిక్షణ లక్ష్యాలను చేరుకోవాలని అయన సూచించారు . శిక్షణ పొందినవారికి దేవస్థానం వివిధ సదుపాయాలు కల్పించింది .