×

శ్రీశైల దేవస్థానంలో ప్రత్యేక పూజలు-పాల్గొన్న ఈ ఓ

శ్రీశైల దేవస్థానంలో ప్రత్యేక పూజలు-పాల్గొన్న ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు  సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్లకు ఊయల సేవను నిర్వహించింది.ప్రతి శుక్రవారం , పౌర్ణమి . మూల నకత్రం రోజులలో ఈ ఊయలసేవ నిర్వహిస్తున్నారు. ఈ సాయంత్రం గం. 7.30ల నుండి ఈ ఊయల సేవ జరిపారు. ఈ ఓ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని  తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపారు.అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామి అమ్మవార్లకు  షోడశోపచార పూజ జరిపారు.ఆ తరువాత విశేషంగా అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్ర నామపూజలు, స్వామివారికి సహస్రనామార్చన జరిగాయి.చివరగా ఊయలసేవ జరిగింది.

ఊయల సేవను పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపారు.పుష్పాలంకరణకు గాను పలుపుష్పాలు వినియోగించారు. అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ ఊయలసేవ విశేషార్చనలను జరిపారు.

నందీశ్వరస్వామికి విశేష పూజలో పాల్గొన్న ఈ ఓ:

లోక కల్యాణం కోసం త్రయోదశిని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు  ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరస్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలు జరిపింది .ప్రతి మంగళవారం,  త్రయోదశి రోజున దేవస్థాన సేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం వుంటుంది. ప్రదోషకాలంలో  సాయం సంధ్యా సమయంలో ఈ విశేష పూజలు నిర్వహించారు.ఈ విశేషార్చనలో  ఈ ఓ పాల్గొన్నారు. ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం అంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజకవర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని చెప్పారు.

అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను జరిపారు.

ఆ తరువాత నందీశ్వరస్వామికి  పంచామృతాలతోనూ, ద్రాక్ష, బత్తాయి, అరటి మొదలైన ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకు మోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం, మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం జరిపారు.

పురుషసూక్తం, వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా  ఈ విశేషాభిషేకాన్ని చేసారు. తరువాత నందీశ్వరస్వామివారికి నూతనవస్త్ర సమర్పణ, విశేష పుష్పార్చనలను చేసారు. తరువాత నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించారు. చివరగా స్వామికి నివేదన చేసారు.

అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ నందీశ్వర స్వామికి ఈ విశేషార్చనలు జరిపారు.

అంకాళమ్మ అమ్మవారికి విశేష పూజలు:

లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత అయిన శ్రీ అంకాళమ్మ అమ్మవారికి ఈ రోజు  ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించారు.

ప్రతి శుక్రవారం  శ్రీ అంకాళమ్మ అమ్మవారికి దేవస్థానం సేవగా సర్కారిసేవగా) ఈ విశేషపూజ వుంటుంది.

ఇందులో భాగంగా శ్రీ అంకాళమ్మ అమ్మవారికి అభిషేకం, విశేష అర్చనలు, పుష్పాలంకరణ, కుంకుమార్చనలు జరిపారు.

print

Post Comment

You May Have Missed