శ్రీశైల దేవస్థానంలో ఘన ఘనంగా శాకంభరీ ఉత్సవం జరిగింది. మంగళవారం ఈ ఉత్సవం తో పాటు గురు పౌర్ణమి కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు వివిధ ఉత్సవాల అనంతరం సాయంత్రం 4 నుంచి ఆలయ ద్వారాలను మూసివేసారు. చంద్ర గ్రహణం సందర్భంగా ఇలా మూసిన ద్వారాలను రేపు ఉదయం 5.౩౦ గంటలకు తెరిచి సంప్రోక్షణ , మంగళ వాయిద్యములు, సుప్రభాత సేవ, మహా మంగళహారతులు నిర్వహిస్తారని దేవస్థానం ఎడిటర్ తెలిపారు.8 గంటల నుంచి దర్శనాలు, 8.౩౦ నుంచి ఆర్జిత అభిషేకాలు,ఆర్జిత కుంకుమ అర్చనలు ప్రారంభిస్తారు.