శ్రీశైల దేవస్థానంలో ఏప్రిల్ 4 , 5 , 6 తేదీలలో పూర్తిగా అలంకార దర్శనం

శ్రీశైల దేవస్థానంలో ఏప్రిల్ 3 వ తేదీ నుంచి 7 వ తేదీ వరకు జరిగే ఉగాది మహోత్సవాలకు సంబంధించి ఈ రోజు భక్త బృందాలతో సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర లకు చెందిన ౩౦ కి పైగా భక్త బృందాలు ఈ రోజు సమావేశంలో పాల్గొన్నాయని సంపాదకుడు డా.అనిల్ తెలిపారు.

భక్తులు ఇబ్బంది పడకుండా ఉండటానికి గాను ఏప్రిల్ 4 , 5 , 6 తేదీలలో శ్రీ స్వామి వార్ల సర్వదర్శనాన్ని నిలుపుదలచేసి పూర్తిగా అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ నెల  29 నుంచి ఏప్రిల్  3 వ  తేదీవరకు శ్రీ స్వామి వార్ల  సర్వదర్శనానికి వీలు కల్పిస్తారు.

ఈ ఉత్సవాల్లో కర్ణాటక, మహారాష్ట్ర లకు చెందిన స్వచ్ఛంద సేవకుల సేవలను వినియోగించుకుంటారు. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 7 వ తేదీ వరకు వీరి సేవలు అందుతాయి.

పారదర్శత కోసం సవకుల చేతుల మీదుగానే లాటరి పద్ధతిలో సేవ ప్రదేశాలను కేటాయించారు. ఈ రోజు సమావేశంలో అధికారులతో పాటు ట్రస్ట్ సభ్యులు గిరీష్ ఎం. పాటిల్ పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.