శ్రీశైలదేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న గోసంరక్షణశాలలోని గోవులకు ఈ రోజు (05.02.2021) న గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను వేసారు.
ఈ టీకాలను వేసేందుకుగాను కర్నూలు జిల్లా పశుసంవర్థకశాఖ సంయుక్త సంచాలకులు వారు ప్రత్యేకంగా సిబ్బందిని పంపించారు.
ఇండియన్ ఇమ్యునాలాజికల్ కంపెనీ, హైదరాబాద్ ఈ టీకా మందును దేవస్థానానికి విరాళంగా అందించింది.
గోశాలలో సుమారుగా 4 సంవత్సరాల వయస్సు పైబడిన 1,166 గోవులకు ఈ టీకాలను వేసారు.
ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామరావు, గో సంరక్షణ సహాయ కార్యనిర్వహణాధికారి కృష్ణారెడ్డి,
గోసంరక్షణశాఖ పర్యవేక్షకులు శ్రీనివాసులు, పశువైద్యాధికారి డా. ఎల్. వి. నారాయణరెడ్డి , సిబ్బంది పాల్గొన్నారు.
*Uuyala Seva, Ankaalamma Vishesha Puuja performed in the temple.