శ్రీశైలదేవస్థానం:శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 11 నుండి 17 వరకు మకర సంక్రాంత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.ఇందులో భాగంగా భోగిరోజున 13వ తేదీన ఉదయం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో చిన్నారులకు ఉచితంగా సామూహిక భోగిపండ్ల కార్యక్రమం ఉంటుంది.సనాతన ధర్మపరిరక్షణలో భాగంగా ఈ సామూహిక భోగిపండ్ల కార్యక్రమాలు చేపట్టారు. 5 సంవత్సరాల వరకు వయస్సుగల చిన్నారులకు ఈ భోగిపండ్లు పోస్తారు. భోగిపండ్ల కార్యక్రమం లో పాల్గొనదలచిన వారు 12వ తేదీ సాయంత్రం గం.5.00లలోపల ప్రచురణల విభాగంలో వారి పేర్లను నమోదు చేసుకోవలసిందిగా దేవస్థానం కోరింది .