శ్రీశైలదేవస్థానం:వైశాఖ బహుళ దశమి సందర్భంగా రేపు (04.06.2021 )న పాతాళగంగ మార్గంలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవం నిర్వహిస్తారు.
కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ ఈ ప్రత్యేక పూజలను ఉంటాయి.
రేపు ఉదయం 7.45 గంటలకు వేదపండితులు, అర్చక స్వాములు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠిస్తారు. ముందుగా మహాగణపతి పూజ చేస్తారు.
తరువాత శ్రీ ఆంజనేయస్వామి వారికి ఆయా సూక్తాలతో పంచామృతాభిషేకం, జలాభిషేకం,స్వామివారికి విశేష అలంకరణ ,పుష్పార్చన, నాగవల్లి దళపూజ ( ఆకుపూజ) వడమాల సమర్పణ చేస్తారు.
* శ్రీశైలదేవస్థానంలో నేడు శ్రీదత్తాత్రేయ స్వామి పూజ జరిగింది.