శ్రీశైలదేవస్థానం: లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత శ్రీ అంకాళమ్మ అమ్మవారికి ఈ రోజు 9న ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించారు.
ప్రతి శుక్రవారం శ్రీఅంకాళమ్మ అమ్మవారికి దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) ఈ విశేషపూజ నిర్వహిస్తారు.
లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు సాయంకాలం శ్రీస్వామి అమ్మవార్లకు ఊయల సేవను జరిపారు.
ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూల నక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ ఉంటుంది.