శ్రీశైలదేవస్థానంలో విధులనుండి తాత్కాలిక సెక్యూరిటీ గార్డ్ M.నరేంద్ర తొలగింపు
శ్రీశైలదేవస్థానం:దేవస్థాన భద్రతా విభాగంలో తాత్కాలిక సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్న M.నరేంద్ర, కొత్తపేట కాలని, శ్రీశైలం ను శాశ్వతంగా విధుల నుంచి తొలగించామని శ్రీశైలదేవస్థానం అధికారిక ప్రకటనలో తెలిపింది.
మద్యం రవాణకు సంబంధించి ఈయనపై ఈ రోజు ( 03.06.2021 ) న కేసు నమోదు అయినందున ఈ చర్య తీసుకున్నామని దేవస్థానం తెలిపింది.
వాస్తవానికి M.నరేంద్ర పూర్తిగా తాత్కాలిక పద్దతిపై మాత్రమే దేవస్థాన భద్రతా విభాగంలో విధులను నిర్వహిస్తున్నారని , గత నెలరోజులుగా విధులకు కూడా హాజరుకావడం లేదని దేవస్థానం తెలిపింది.
దేవస్థానం లో ఏ ఉద్యోగి అయినా భవిష్యత్తులో దేవస్థాన నిబంధనలకు, క్షేత్ర పవిత్రతకు భంగం కలిగించే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని దేవస్థానం ఈ ఓ పేర్కొన్నారు.
Post Comment