శ్రీశైలదేవస్థానంలో గో సంరక్షణకు సకల చర్యలు అవసరం -ఈ ఓ ఆదేశం
శ్రీశైలదేవస్థానం:శ్రీశైలదేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈ రోజు 26 న ఆకస్మికంగా గో సంరక్షణశాలను తనిఖీ చేశారు.ప్రస్తుతం దేవస్థానం గోశాలలో 1350కి పైగా గోవులు, దూడలు, ఎద్దులు సంరక్షణలో ఉన్నాయి. మొత్తం రెండు ప్రాంగణాలలో గో సంరక్షణశాలలు నిర్వహిస్తున్నారు.
గోవుల సంరక్షణ, గోశాల అభివృద్ధి గురించి కార్యనిర్వహణాధికారి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలను ఇచ్చారు.ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ గో సంరక్షణ నిపుణులను శ్రీశైలానికి ఆహ్వానించి వారి సూచనలు – సలహాలను పొందాలని సంబంధిత విభాగాన్ని ఆదేశించారు. దీనివలన గోశాలను మరింత సమర్థవంతంగా నిర్వహించే వీలుకలుగుతుందన్నారు.ముఖ్యంగా గోశాలలోని గోవులను గుంపులుగా వర్గీకరించాలన్నారు. గోవుల వయస్సు, వాటి శారీరక స్థితి, ఆరోగ్యస్థితి మొదలైన అంశాలను పరిగణన లోకి తీసుకుని ఈ వర్గీకరణను జరపాలన్నారు.వర్గీకరణ ప్రకారంగా గోవులను గోశాల ప్రాంగణంలో వేరువేరు చోట్ల ఉంచి సంరక్షిస్తుండాలని ఆదేశించారు. అదేవిధంగా గోశాలలో బలహీనపడిన గోవులు, జబ్బుపడే గోవుల పట్ల కూడా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.గోవులన్నింటికీ శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. ప్రతి గోవుకు కూడా తగినంత మేత, స్వచ్ఛమైన త్రాగునీరు అందేందుకు గాను అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలన్నారు.గోశాలలో శుచిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎప్పటికప్పుడు గోశాల శుభ్రపరిచేందుకు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. దీనివలన ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందుతుందన్నారు.
గోవులలో అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వాటికి కాలానుగుణంగా టీకా మందులను వేయించాలని గో సంరక్షణశాల వైద్యాధికారిని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. గోవు సంరక్షణకు అవసరమైన ఔషధాలన్నింటిని సిద్ధంగా వుంచుకోవాలన్నారు.
ఆవులు సౌకర్యవంతంగా తిరిగేందుకు వీలుగా గోశాల ఎదురుగా ఆరుబయలు ప్రదేశంలో తగు ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా గోశాల ప్రాంగణములోనికి విషసర్పాలు జొరపడకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్మురళీ బాలకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహరెడ్డి, గోశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
E.O. appealed to the devotees not to believe rumours on temple. Addressing the media today E.O. said some trying to tarnish the image of the temple.
| గో గర్భాన్ని పరిశీలించిన కార్యనిర్వహణాధికారి:
పరిశీలన సందర్భంగాకార్యనిర్వహణాధికారి గోశాల వెనుకభాగంలో గల భీముని పాదాలు, గోగర్భాన్ని కూడా పరిశీలించారు.
పలువురు భక్తులు తమ శ్రీశైలయాత్రలో భాగంగా ఈ ప్రదేశాలను కూడా దర్శించడం జరుగుతూ ఉంటుందని, ఈ ప్రదేశాలను కూడా అభివృద్ధి చేసేందుకు తగు ప్రణాళికలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
యోగ ఒక జీవన విధానం:
సనాతన సంప్రదాయ పరిరక్షణలో భాగంగా ఈ రోజు దేవస్థానం యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ రోజు ఉదయం ఆలయ దక్షిణ మాడవీధిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. యోగా కార్యక్రమంలో పతంజలి యోగా పీఠం, ఆంధ్రప్రదేశ్ శాఖకు చెందిన యోగాచార్యులు యోగాసంబంధి అంశాలను వివరించారు.స్థానికులతో పాటు పలువురు యాత్రికులు కూడా ఈ యోగా కార్యక్రమములో పాల్గొన్నారు.
ఈ అవగాహనకార్యక్రమములో పతంజలి యోగపీఠ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం ఆయా అంశాలను వివరిస్తూ అందరిచేత యోగాసనాలు చేయించారు.కార్యక్రమములో మస్తిష్క శిక్షణా నిపుణులు ( బ్రెయిన్ టైనర్) శివరాజ్, బెంగుళూరు వారు కూడా పాల్గొని యోగాసంబంధి అంశాలను వివరించారు.
ముందుగా అందరిచేత సూర్యనమస్కారాలు చేయించారు. తరువాత యోగాసనాలు జరిగాయి.
ఆసనాల తరువాత సూక్ష్మవ్యాయామం చేయించారు. తరువాత ప్రాణాయామం చేయించారు. చివరగా శాంతిమంత్రాలతో యోగా కార్యక్రమం ముగిసింది.
కార్యక్రమంలో ప్రతి ఆసనానికి కూడా యోగాచార్యులు వివరణ ఇస్తూ యోగాపరమైన అంశాలను అధునిక వైద్యవిజ్ఞానంతో అనుసంధానం చేస్తూ ఆయా విశేషాలను, యోగా వలన కలిగే విశేషాలను తెలియజేశారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ జ్యోతిర్లింగ సహిత శక్తిపీఠ క్షేత్రములో యోగా సాధన చేయడం ఎంతో అదృష్టంగా భావించాలన్నారు.
మన పురాణాలు పరమశివుడిని ఆదియోగిగా స్తుతించాయన్నారు. వేద విజ్ఞానానికి నిలయమైన మన భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుండి అభివృద్ధి చెందిన పలు శాస్త్రాలలో యోగాశాస్త్రం కూడా ఒకటని అన్నారు. .
శారీరక ఆసనాలు, శ్వాసపై ధ్యాస, ధ్యానం, ప్రాణాయామం, ముద్రలు మొదలైనవన్ని యోగాలోని ప్రధాన క్రియలని అని చెబుతూ వాటి ప్రాధాన్యాన్ని వివరించారు. ఆరోగ్యకరమైన జీవితం, సుఖసంతోషాలు, బాధల నుండి విముక్తి, మానసిక ప్రశాంతత మొదలైనవన్ని కూడా యోగ సాధన ద్వారా పొందవచ్చునని అన్నారు. యోగా ఒక జీవన విధానమని, దీనివలన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో మంచి ఫలితాలు పొందవచ్చునని పేర్కొన్నారు.
అనంతరం యోగా గురువుబాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల అనుగ్రహంతోనే తమకు శ్రీశైల క్షేత్రంలో యోగా కార్యక్రమములో పాల్గొనే అవకాశం లభించిందన్నారు. యోగా చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుందని, రోగనిరోధకశక్తి ఎంతగానో పెంపొందుతుందని, అందుకే మన మహర్షులు యోగాను ప్రబోధించారన్నారు.
ఈ కార్యక్రమములో శ్రీస్వామివారి ఆలయ విశ్రాంత ప్రధానార్చకులు శ్రీ పీఠం మల్లికార్జునస్వామి శీరానం వేశారు.
ఈ యోగా అవగాహనలో ఆలయ సహాయకార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Post Comment