శ్రీశైలదేవస్థానంలో కార్తీక మాసోత్సవాల ఏర్పాట్లపై ఈ ఓ భారీ సమీక్ష

  • శ్రీశైలదేవస్థానం:నవంబరు 16వ తేదీ నుండి డిసెంబరు 14వ తేదీ వరకు కార్తీకమాసోత్సవాలు నిర్వహిస్తారు.కార్తీకమాస ఏర్పాట్లకు సంబంధించి నవంబరు 11 న  పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో  వివిధ విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, దేవస్థానం వైద్యశాల వైద్యులు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో లో స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.వి. రమణ, సబ్ ఇన్స్పెక్టర్ హరిప్రసాద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డా. సోమశేఖరయ్య తదితరులు కూడా పాల్గొన్నారు. 

    కోవిడ్ నిబంధనలు, భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, శ్రీస్వామిఅమ్మవార్ల ఆర్జిత సేవలు, పారిశుద్ధ్యం, పార్కింగ్, పర్వదినాలలో లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి, కార్తిక పౌర్ణమి రోజన జ్వాలాతోరణం,  నదీహారతి ఏర్పాట్లు మొదలైన అంశాలను గురించి సుదీర్ఘంగా చర్చించారు . సమావేశంలో ఈ క్రింది అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.

    సిబ్బందికి ప్రత్యేక విధులు : • భక్తులకు సేవలు అందించేందుకుగాను కార్తికమాసంలో రద్దీరోజులందు కార్యాలయ సిబ్బందికి

    ప్రత్యేక విధులు కేటాయిస్తారు.

  • కోవిడ్ నిబంధనలు :దర్శనానికి విచ్చేసే భక్తులు తప్పనిసరిగా ఆన్లైన్లో దర్శనాల రిజిస్ట్రేషన్ చేయించుకోవలసిఉంటుంది. • టైమ్ స్లాట్ పద్ధతిలో  కేటాయించిన  నిర్ణీత సమయాలలో వీరిని దర్శనానికి అనుమతీస్తారు.క్షేత్రానికి విచ్చేసే భక్తులు ముందస్తుగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవడం అవసరం. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా 10 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయస్సు గల వారిని మాత్రమే దర్శనానికి అనుమతీస్తారు. • 65 సంవత్సరాలు పైబడిన వారు ప్రస్తుతానికి వారి యాత్రను వాయిదా వేసుకోవలసినదిగా విజ్ఞప్తి • దర్శనానికి విచ్చేసే భక్తులు తమ ఆధార్ / గుర్తింపుకార్డును తప్పనిసరిగా తీసుకురావలసి వుంటుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ టోకనును వారి గుర్తింపుకార్డుతో సరిపోల్చిన తరువాతనే దర్శనానికి అనుమతీస్తారు.
  • కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా పలు ప్రత్యేక చర్యలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ దర్శనాలకు విచ్చేసే భక్తులందరు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించవలసి ఉంటుంది.  విధిగా భౌతిక దూరాన్ని పాటించవలసి వుంటుంది. క్యూలైన్లలో భక్తులు సామాజిక దూరాన్ని పాటించేందుకు వీలుగా గతంలోనే వృత్తాలతో మార్కింగ్ చేస్తారు . దర్శన ప్రవేశద్వారం ప్రత్యేక కేంద్రంలో ఏర్పాటు చేసి ధర్మల్ గన్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను పరీక్షిస్తారు. • ఈ ప్రత్యేక కేంద్రం వద్దనే ఆన్ లైన్ లో పొందిన దర్శన రిజిస్ట్రేషన్ పత్రాన్ని స్కాన్ చేసి దర్శనానికిఅనుమతీస్తారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్ ప్రవేశమార్గం వద్ద ,, ఆలయం నుంచి వెలుపలికి వచ్చే మార్గములోనూ భక్తులు చేతులు శుభ్రపరుచుకునేందుకు వీలుగా మరిన్నీ నీటి కుళాయిలు ఏర్పాటు చేతులను శానిటైజేషన్ చేసుకునేందుకు వీలుగా క్యూలైన్ ప్రవేశద్వారంవద్ద, మహాద్వారం వద్ద , పలుచోట్ల మరిన్ని శానిటైజర్లను ఏర్పాటు • భక్తుల సౌకర్యార్థం పలుచోట్ల లెగ్ ఆపరేటెడ్ శానిటైజింగ్ స్టాండులను ఏర్పాటు • ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా ఎప్పటికప్పుడు క్యూలైన్లను శుభ్రం చేయడం.ముఖ్యంగా క్యూలైన్ల పైపులు, ఆలయప్రాంగణంలోని కటంజనాలను, మెట్లమార్గములోని రైలింగులు

    మొదలైనవాటిని నిర్ణీత సమయాలలో శాస్త్రీయ పద్ధతిలో శానిటైజెషన్ చేయడం.

  • • కరోనాను అరికట్టేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణ చర్యలు మొదలైన వాటి గురించి భక్తులలో అవగాహన కలిగించేందుకు దేవస్థానం ప్రసార వ్యవస్థ ద్వారా (మైకుద్వారా) ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తారు. • కరోనా అరికట్టే విషయమై భక్తులలో అవగాహన కల్పించేందుకు,  తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మరిన్ని ఫ్లెక్సీ బోర్డులను కూడా పలు చోట్ల ఏర్పాట్లు చేయబడ్డాయి.
  • దర్శనం ఏర్పాట్లు : • ప్రస్తుతం ఆచరణలో ఉన్నట్లుగానే కార్తీకమాసంలో కూడా శ్రీస్వామి అమ్మవార్ల లఘుదర్శనానికి ( దూరదర్శనానికి) మాత్రమే అవకాశం వేకువజామున గం. 4.00లకు ఆలయద్వారాలు తెరచి ఉదయం గం. 5.30ని.ల నుంచి సాయంకాలం గం.4.00ల వరకు, తిరిగి సాయంత్రం గం. 5.30 నుండి రాత్రి గం.10,00ల వరకు దర్శనాలకు అనుమతి
  • ఆర్జితసేవలు : • కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతిరోజూ నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలుమొదటి విడత ఉదయం . గం. 6.30 లకు : రెండవ విడత ఉదయం గం. 8.30లకు : మూడవ విడతఉదయం గం. 11.30లకు : నాలగవ విడత సాయంత్రం గం.8.30లకు • రెండు విడతలుగా ఆర్జిత హోమాలు
  • రుద్రహోమం – మృత్యుంజయహోమాల మొదటి విడత ఉదయం గం. 8.00లకు మరియు రెండవ

విడత గం.9.30లకు • చండీహోమం మొదటి విడత ఉదయం గం. 7.30లకు రెండవ విడత ఉదయం గం.10.00లకు

అన్నప్రసాదాల వితరణ :

  • కార్తీకమాస ప్రారంభం రోజు నుంచి భక్తులకు అన్నదాన భవనములో అన్నప్రసాదాల వితరణ • కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్నప్రసాదాల వితరణ
  • రద్దీ రోజులలో క్యూలైన్లలో వేడిపాలు, మంచినీటి సరఫరా లడ్డు ప్రసాదాలు :

కార్తీకమాసంలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు

సిద్ధం చేయబడుతాయి. • రద్దీకి అనుగుణంగా ప్రసాదాల విక్రయ కేంద్రాలు ఏర్పాటు

  • విక్రయ కేంద్రాల వద్ద కోవిడ్ నివారణకు ప్రత్యేక చర్యలు కార్తీకమాసం సందర్భంగా శివచతుస్సప్తాహ భజనలు : • లోకకల్యాణం కొరకు గతంలో వలనే ఈ సంవత్సరం కూడా కార్తీకమాసంలో అఖండ శివచతుస్సప్తాహ భజన కార్యక్రమ నిర్వహణ. • కార్తీకమాసమంతా ఆలయములో నిరంతరంగా శివభజనలు. పుష్కరిణి వద్ద లక్షదీపార్చన మరియు పుష్కరిణి హారతి

కార్తీకసోమవారాలు , పౌర్ణమిరోజున (29.11.2020-సాయంకాలం పౌర్ణమి ఘడియలు

ఉండడంతో) “పుష్కరిణి ” వద్ద లక్షదీపార్చన,  పుష్కరిణి హారతి. కార్తీక దీపోత్సవం • భక్తులు కార్తీకదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ప్రత్యేక ఏర్పాట్లు

పుణ్యనదీ హారతి

కార్తీక పౌర్ణమి (29.11.2020 – సాయంకాలం పౌర్ణమి ఘడియలు ఉండడంతో) రోజున కృష్ణవేణినదీమతల్లికి పుణ్యనదీహారతి కార్యక్రమం

పాతాళగంగ వద్ద ఉన్న కృష్ణవేణీ విగ్రహానికి పూజాదికాలు. జ్వాలా తోరణం

కార్తీక పౌర్ణమి (29.11.2020 – సాయంకాలం పౌర్ణమి ఘడియలు ఉండడంతో) రోజున ఆలయం ముందుగల గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం.

*Saakshi Ganapathi  Abhishekam performed in the temple.

*Jwaala Veerabhdra Swami Puuja performed on this day with temple traditions.

*]Kollipaka Sambasiva Rao, Hyderabad, Telangana State donated   Rs,1,00,016 For Annadhaanam scheme in the temple.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.