శ్రీశైలం లో స్వామి అమ్మవార్ల దర్శనాలు ప్రారంభం

దర్శనాలు ప్రారంభం*

ఈ రోజు  స్వామి అమ్మవార్ల దర్శనాలు ప్రారంభమయ్యాయి.

రాష్ట్ర దేవదాయశాఖ కమీషనర్ వారి ఉత్తర్వుల మేరకు ఆలయములో ప్రయోగాత్మక పరిశీలనగా గత రెండు రోజులలో ప్రయోగాత్మక దర్శనాలు నిర్వహించారు. ప్రయోగాత్మక దర్శనాలలో దేవస్థానం సిబ్బందిని , స్థానికులను అనుమతించారు .

కాగా ఈ రోజు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి దర్శనాలు కల్పించారు.
ముందస్తుగా ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న భక్తులను దర్శనాలకు అనుమతించారు.

టైమ్ స్లాట్ పద్దతిలో అనగా కేటాయించబడిన నిర్ణీత సమయాలలో వీరికి దర్శనాలు కల్పించారు . వారివారి ఆధార్ కార్డు | గుర్తింపుకార్డుతో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ టోకనును సరిపోల్చి భక్తులను అనుమతిస్తున్నారు.

క్యూలైన్ల ప్రవేశం వద్దనే ఉచిత దర్శనం,  శీఘ్రదర్శన టోకన్లను బార్ కోడ్ స్కానింగ్ చేస్తున్నారు.

కాగా కరోనా అరికట్టడంలో భాగంగా పలు ముందుజాగ్రత్తలు తీసుకోబడుతున్నాయి.

దర్శనప్రవేశద్వారం వద్ద ప్రత్యేకకేంద్రాన్ని ఏర్పాటు చేసి ధర్మల్ గన్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను పరీక్షిస్తారు.

క్యూలైన్ ప్రవేశమార్గం వద్ద, ఆలయ మహాద్వారం, ఆలయం నుంచి వెలుపలికి వచ్చే మార్గాలలో భక్తులు చేతులు శుభ్రపరుచుకునేందుకు వీలుగా నీటి కుళాయిలు ఏర్పాటు చేయబడ్డాయి.

చేతులను శానిటైజేషన్ చేసుకునేందుకు వీలుగా క్యూలైన్ ప్రవేశద్వారం వద్ద, మహాద్వారం వద్ద మరియు పలుచోట్ల శానిటైజర్లను ఏర్పాటు చేసారు .

మహాద్వారం వద్ద భక్తులు కాళ్లు కడుక్కునేందుకు కూడా తగు సౌకర్యాలు కల్పించారు . భక్తుల సౌకర్యార్థం లెగ్ ఆపరేటెడ్ శానిటైజింగ్ స్టాండులను ఏర్పాటు చేసారు .

ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా ఎప్పటికప్పుడు క్యూలైన్లను శుభ్రం చేయడం జరుగుతోంది. ముఖ్యంగా క్యూలైన్ల పైపులు, ఆలయప్రాంగణంలోని కటాంజనాలను, మెట్లమార్గములోని రైలింగులు మొదలైనవి కూడా నిర్ణీత సమయాలలో శాస్త్రీయ పద్ధతిలో శానిటైజెషన్ చేయబడుతున్నాయి.

క్యూలైన్లలో భక్తులు సామాజిక దూరాన్ని పాటించేందుకు వీలుగా వృత్తాలతో మార్కింగ్ చేయడం జరిగింది.
ప్రస్తుతానికి శ్రీస్వామిఅమ్మవార్ల లఘుదర్శనానికి ( దూరదర్శనానికి) మాత్రమే అవకాశం కల్పించారు..

అదేవిధంగా తీర్థం, ఉచిత ప్రసాద వితరణ, శఠారీ ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది.

భక్తులలో అవగాహన కల్పించేందుకుగాను దేవస్థాన ప్రసారవ్యవస్థ ( మైక్) ద్వారా సూచనలు అందజేయబడుతున్నాయి.

అన్నప్రసాద పొట్లాల వితరణ
కరోనాకట్టడి చర్యలలో భాగంగా ప్రస్తుతం దేవస్థానం అన్నదానభవనములో పంక్తి భోజనాలను తాత్కాలికంగా నిలుపుదల చేసారు.

అందుకే భక్తుల సౌకర్యార్థమై అన్న ప్రసాద పొట్లాలను అందజేసారు.
ఈ రోజు (10.06.2020) పులిహోర, పెరగన్నం పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లు అందజేచారు .
అదేవిధంగా దర్శనాలు ప్రారంభమయైన సమయం నుండి ఆహారపొట్లాల వితరణ ప్రారంభించేంత వరకు కూడా బిస్కెట్ ప్యాకెట్లు అందజేసారు.

రేపు స్థానిక ఆశ్రమవాసులకు మరియు సాధువులకు దర్శనాలు
రేపు (11.06.2020) ఉదయం 6గంటల నుండి 8గంటల వరకు స్థానిక ఆశ్రమ నిర్వాహకులకు, ఆశ్రమవాసులకు మరియు సాధువులకు శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనాన్ని కల్పించాలని నిర్ణయించారు.

కావున ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనాన్ని చేసుకోవలసినదిగా కోరుచున్నాము.

అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్ విభాగంతో సమావేశం*

క్షేత్ర అభివృద్ధిలో భాగంగా దేవస్థానం చేపట్టిన పలు అభివృద్ధి పనులను కార్యనిర్వహణాధికారి ఈ రోజు ( 10.06.2020) ఇంజనీరింగ్ అధికారులతో జరిపిన సమావేశములో సమీక్షించారు.

పరిపాలనా కార్యాలయములోని సమావేశమందరిములో జరిగిన ఈసమీక్షలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పి. మురళీ బాలకృష్ణ, డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు  నరసింహరెడ్డి,  శ్రీనివాసరెడ్డి, ఇంజనీరింగ్ విభాగ అసిస్టెంట్ ఇంజనీర్లు, ఉద్యానవన అధికారి, అసిస్టెంట్ స్థపతి తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశములో పంచమఠాల పునర్నిర్మాణం, గణేశసదన నిర్మాణం, సిబ్బంది వసతి గృహాల నిర్మాణం, సౌండ్ అండ్ లైట్ షో మొదలైన వాటిని కూలంకుషంగా చర్చించారు .

దేవస్థానం చేపట్టిన ంజనీరింగ్ పనుల ప్రస్తుత పరిస్థితి, ఆయా పనులలో ఇంకనూ పూర్తి చేయాల్సిన అంశాలు మొదలైన వాటి గురించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీ బాలకృష్ణ సమావేశంలో వివరించారు.
సమావేశములో ముందుగా పంచమఠాల పునర్నిర్మాణ పనులను సమీక్షించారు.

ఈ పంచమఠాలలో విభూతిమఠ, రుద్రాక్షమఠ పునర్నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కాబడ్డాయి. ఘంటామఠ పునర్నిర్మాణములో ప్రస్తుతం ప్రధానాలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ శ్రీశైల సంస్కృతి సంప్రదాయములో పంచమఠాలకు ఎంతో ప్రత్యేకమైన స్థానముందన్నారు. అది క్రవారసత్వ కట్టడాలుగా పేర్కొనడం జరుగుతుందన్నారు.

అందుకే వీలైనంత త్వరలో ఈ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. పునర్నిర్మాణ పనులలో భాగంగానే ప్రతి మఠం చుట్టూ ప్రాకారాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా భక్తులందరు పంచమఠాలను ఒకేసారి దర్శించుకునేందుకు వీలుగా అన్ని మఠాలను కలుపుతూ (ఒకే సర్కూట్ గా) ఏక రహదారిని నిర్మించే అంశాన్ని పరిశీలించి, వెంటనే ప్రణాళికను సిద్ధం చేయాల్సిందిగా కూడా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా విభూతిమఠం ముందుభాగంలో గల ప్రాచీన మెట్ల మార్గానికి కూడా తగు మరమ్మతులు చేపట్టి, ఆ మార్గాన్ని పునరుద్ధరించాలని కూడా కార్యనిర్వహణాధికారి వారు ఆదేశించడం జరిగింది.

పంచమఠాల ప్రాంగణములో ల్యాండ్ స్కేపింగ్ పనులతో పాటు అనువైన మొక్కలు నాటే పనులు వెంటనే ప్రారంభించాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు.

ఈ పంచమఠాల పునర్నిర్మాణ పనులను దేవస్థానం చేపట్టగా, పంచమఠాలలో ల్యాండ్ స్కేపింగ్, కాలిబాట రహదారులు మరియు ఆకర్షణీయమైన విద్యుద్దీకరణ పనులు ప్రభుత్వ ప్రసాద్ (Pilgrimage Rejuvenation And Spiritual Augmentation Drive) పథకం కింద జరుగుతన్నా యి.
తరువాత టూరిస్ట్ బస్టాండ్ సమీపములో గణేశసదనం పేర నిర్మిస్తున్న 224 గదుల సముదాయ పనులను సమీక్షించారు.

మొత్తం నాలుగు బ్లాకులుగా నిర్మిస్తున్న ఈ సముదాయములో ఎ బ్లాక్ నందు 56 గదులు, బి బ్లాక్ లో 56 గదులు, సి బ్లాక్ లో 48 గదులు, డి బ్లాక్ లో 64 గదులు నిర్మించబడుతున్నాయి.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ పనులను వేగవంతం చేసి నిర్మాణాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేయాలన్నారు. ఈ సముదాయ ప్రాంగణానికి సమీపంలోనే అవకాశం మేరకు పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా సముదాయప్రాంగణమంతా కూడా పచ్చదనాన్ని పెంపొందిచేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభిచాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు.

తరువాత వారు శ్రీశైలం ప్రాజెక్టులో దేవస్థానం నిర్మిస్తున్న సిబ్బంది వసతి గృహాల నిర్మాణపు పనులను సమీక్షించారు.

దేవస్థాన సిబ్బందికి వసతిని కల్పించేదుకై మూడు బ్లాకులలో ఈ సిబ్బంది వసతి గృహాలు నిర్మించబడుతున్నాయి.

మొత్తం 3 నమూనాలలో అనగా 1 – బి.హెచ్. కె. స్మాల్, 1 – బి.హెచ్. కె. బిగ్ మరియు 2 – బి.హెచ్. కె. బిగ్ పేర్లతో వీటిని దేవస్థానం నిర్మిస్తున్నది.

1- బి.హెచ్.కె. స్మాల్ నందు 108 గృహాలు, 1 – బి. హెచ్. కె. బిగ్ నందు 108 గృహాలు, 2 బి.హెచ్. కె. బిగ్ నందు 81 గృహాలుగా మొత్తం 297 గృహాలు నిర్మించబడుతున్నాయి.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారివారు మాట్లాడుతూ నిర్మాణపు పనులు చేపట్టి ఇప్పటికే రెండు సంవత్సరాల కాలం పూర్తయినందున వీలైనంత త్వరగా నిర్మాణపు పనులు పూర్తి చేయాలన్నారు.

తరువాత వారు భక్తుల సౌకర్యార్థమై నడకదారులలో (ఫుట్ పాత్) ఏర్పాటు చేసిన షెడ్లు, క్యూకాంప్లెక్స్ ముందు ఏర్పాటు చేసిన షెడ్లు, మరికొన్ని సాధారణ పనుల గురించి సమావేశములో చర్చించారు.

ముఖ్యంగా పనుల నిర్మాణములో పూర్తి నాణ్యత ప్రమాణాలను పాటించాలని, ఏ చిన్న పనులలో కూడా నాణ్యతాపరంగా రాజీపడకూడదని అధికారులను సూచించారు.

పనులను వేగవంతం చేయడముతో పాటు నాణ్యతను పాటించడం కూడా ఎంతో అవసరమన్నారు. నిర్మాణమునకు సంబంధించి ఎప్పటికప్పుడు క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు చేయించాలన్నారు.

వర్షాకాలం ప్రారంభమవుతున్నందున శ్రీశైలక్షేత్ర పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమానికి వెంటనే ప్రణాళికలు రూపొందించాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు.

print

Post Comment

You May Have Missed