శ్రీశైలం దేవస్థానం హుండీ కౌంటింగ్ బుధవారం జరిగింది . 35 రోజులకు రూ. 2,41,12,653/- , 599 యుఎస్ డాలర్లు, 500 ఎస్ఏయు రియాల్స్, 52 సింగపూర్డాలర్లు, 40 కెనడా డాలర్లు, 75మలేషియా రింగిట్స్, 110 యు.ఏ.ఈ దిర్హమ్స్, ½ కువైట్ డాలర్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో అందాయి . శ్రీశైల శిఖర దివ్య జ్యోతి స్థూపానికి భూమి పూజ జరిగింది . ఈ ఓ శ్రీరామచంద్ర మూర్తి భూమిపూజ చేసారు . దేవస్థానం వారు పాల్గొన్నారు . వచ్చే కార్తిక పౌర్ణమి నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు . శ్రీశైలంలోని అన్ని ప్రదేశాల నుంచి ఈ జ్యోతి కనపడేలా స్థూప నిర్మాణం చేయాలని భావిస్తున్నారు .భక్తులు శివ పంచాక్షరి మంత్రాన్ని , అమ్మవారి నామ మంత్రాన్ని రాసి అందించే పుస్తకాలను వచ్చే కార్తిక పౌర్ణమి నవంబరు 23 న శిఖరేశ్వరాలయం వద్ద నిర్మించనున్న శ్రీశైల శిఖర దివ్యజ్యోతి స్థూపంలో నిక్షిప్తం చేయాలని నిర్ణయించారు . Borra Samba Siva Rao of Hyderabad donated Rs,2,00,000 to Annadhaanam scheme.