శ్రీశైలం దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఆదివారం జరిగింది. సాయంత్రం ఈ ఓ ఆధ్వర్యంలో పరిపాలన భవనంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.వంగాల శివరామిరెడ్డి (శ్రీశైలం),చాటకొండ శ్రీనివాసులు (డోన్),మర్రి శ్రీరాములు (పత్తికొండ),కలర్స్ రవినాథరావు (శ్రీశైలం),చిట్టిబొట్ల భరద్వాజ్ శర్మ (శ్రీశైలం ),శ్రీమతి బండి రమణమ్మ (నందికొట్కూరు),తెలిదేవులపల్లి వెంకట శ్రీరామమూర్తి(ఒంగోలు),పత్తి వెంగన్న (మార్కాపురం),అల్తూరి గిరిశ్ రెడ్డి (నెల్లూరు),చింతా శంకర మూర్తి(అమలాపురం),ఆర్ .జి .శివశంకర్(కల్యాణదుర్గం),గొల్లపూడి లక్ష్మి శ్రీధర్ (వరంగల్ వెస్ట్ ),ఎస్ .వై .దేవరెడ్డి (నల్గొండ ),గిరిష్ ఎం పాటిల్(రాయచూరు),ఎక్స్ అఫిషియో సభ్యులు ఎం.మల్లికార్జున స్వామి(ప్రధాన అర్చకులు) లతో ఈ ఓ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సభ్యులు అంతా కలసి .వంగాల శివరామిరెడ్డి (శ్రీశైలం) ను అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ధర్మకర్తల మండలి వారందరినీ ఈ ఓ సత్కరించారు. అంతా శ్రీస్వామీ అమ్మవార్లను దర్శించుకున్నారు.అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనం చేసారని ఈ ఓ ఉత్తర్వుల మేరకు దేవస్థానం పీ ఆర్ ఓ తెలిపారు.