శ్రీశైలం దేవస్థానం ఉద్యానవనానికి అవార్డ్ ప్రకటించారు. దేవస్థానం చక్కగా అభివృద్ధి చేసిన శంకరవనం ఏపీ గ్రీన్ అవార్డ్కు ఎంపిక అయింది . ఈనెల 14వ తేదీన కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐ.టి . ప్రాంగణంలో ఆ రోజు ఉదయం నిర్వహించే అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దేవస్థానం ఈ ఓ కు ఈ అవార్డు అందిస్తారని సమాచారం .ఆలయానికి ఉత్తరం వైపున 0.5 ఎకరం లో శంకరవనం అభివృద్ధి జరిగింది . ఇలాంటి ఉద్యానవనాలను రాక్ గార్డెన్ అని పిలుస్తారు . ఉద్యాన మండపం కూడా ఇక్కడ ఏర్పాటు చేసారు .