శ్రీశైలం దేవస్థానం ప్రాంగణంలోని నందీశ్వరస్వామి కి మంగళవారం విశేష పూజలు జరిగాయి .దేవస్థానం ఈ ఓ శ్రీరామచంద్ర మూర్తి ,ఇతర అధికారులు , అర్చక స్వాములు పాల్గొన్నారు .
హైదరాబాద్ కు చెందిన సి.హెచ్ .మల్లేష్ ,శ్రీమతి శ్రీలత దంపతులు శ్రీ భ్రమరాంబా దేవి అమ్మవారికి రూ . 1,73,500 విలువైన 47 గ్రాముల విలువైన బంగారు లక్ష్మీ కాసుల హారాన్ని సమర్పించారు .ఈ హారాన్ని విరాళంగా ఈ ఓ కు అందించారు .దేవస్థానం వారు దాతలకు శ్రీస్వామి అమ్మవార్ల ప్రసాదాలు అందించారు . వేద ఆశీర్వచనం జరిగింది.