శ్రీశైలంలో మరో సొరంగం బయటపడింది. రుద్రాక్ష మఠం జీర్ణోద్ధరణ పనుల కోసం తవ్వకాలు జరుపుతుండగా జనవరి 31 న సొరంగం బయటపడింది. నాలుగు అడుగుల విస్తీర్ణంలో ఒక వ్యక్తి ప్రశాంతంగా కూర్చుని తపస్సు చేసుకునేందుకు వీలుగా ఉన్న గదులు న్నట్లు గుర్తించారు. తవ్వకాల్లో ఒక శివలింగంతోపాటు పూజా సామగ్రి కూడా బయటపడింది. వీటిని చూసేందుకు స్థానికులు భారీగా తరలిరాగా పోలీసులు అదుపు చేశారు. పెద్ద ఎత్తున పూజా సామగ్రి, ఒక శివలింగము, 26 చెంబులు, ధూపం పెట్టే పాత్ర, రెండు బేసిన్లు, ఒక బాలె, మరో పెద్ద పాత్ర, 4 గంటలు, నాలుగు హారతి ఇచ్చే పలకలు, రెండు కడియాలు, ఐదు గజ్జెలు బయటపడ్డాయని తెలుస్తోంది . పూర్తి వివరాలు అందాల్సి ఉంది .