శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. సోమవారం ఉయ్యాలసేవ ,హంసవాహన సేవ ,కాత్యాయ నిదేవి పూజలు,హంసవాహన పూజలు,పుష్పపల్లకిసేవ , గ్రామోత్సవాలు రామణీయంగా జరిగాయి. సాంస్కృతిక విభాగంలో మైసూరు కు చెందిన చందన కుమార్ వయోలిన్ వాద్యం అలరించింది. దేవస్థానం వారు చక్కని ఏర్పాట్లు చేసారు.