శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి . ఈ మేరకు శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఎ.శ్రీరామచంద్ర మూర్తి సమీక్ష నిర్వహించారు. ఈనెల 8 వ తేదీన కార్తీక మాసోత్సవాలు ప్రారంభమవుతాయి. భక్తులు అధికంగా వచ్చే రోజుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు.ఆర్జిత హోమాలు , భజనలు ,పుణ్యనది హారతి ,జ్వాలాతోరణం, పుష్కరిణి వద్ద లక్షదీపార్చన మొదలైన కార్యక్రమాలు ఉంటాయి.