శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు దర్శన వేళల నిర్ణయం జరిగింది. ఈ విషయాలను సమీక్షించడానికి ఆదివారం శ్రీశైలం దేవస్థానం ఈ ఓ భరత్ ఆధ్వర్యంలో భక్త బృందాలతో సమావేశం జరిగింది . మార్చి 15 వ తేదీ నుంచి 19 వ తేదీవరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి . భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగారాదని భావించి దర్శన సమయాలను నిర్ణయించారు . నేటి సమావేశంలో ఈ విషయాలపై ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకున్నారు . ఉగాది కి ముందుగా మార్చి 10 వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు ఆరు రోజుల పాటు శ్రీ స్వామి వారి సర్వ దర్శనం కల్పిస్తారు . 16 వ తేదీ నుంచి 18 వ తేదీవరకు 3 రోజుల పాటు శ్రీ స్వామి వారి అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పిస్తారు . మహాశివరాత్రి ఉత్సవాలలో మాదిరిగానే ఉగాది ఉత్సవాల్లో కుడా రద్దీ ఎక్కువగా ఉండే 3 రోజులు అంటే మార్చి 16 నుంచి 18 వరకు శ్రీస్వామి వారి అలంకార దర్శనం కల్పిస్తారు .
ఈ రోజు సమావేశంలో కర్ణాటకలోని బీజాపూర్ , బాగల్ కోట్ , గుల్బర్గా, యాదగిరి , బీదర్ , రాయచూర్ ,ధార్వాడ్, మహారాష్ట్ర లోని సాంగ్లీ , షోలాపూర్ తదతర ప్రాంతాలకు చెందిన దాదాపు ౩౦ భక్త బృందాలు పాల్గొన్నాయి .ఉగాది మహోత్సవాలలో మహారాష్ట్ర. కర్ణాటక రాష్ట్రాలకు చెందిన స్వచ్ఛంద సేవకుల సేవలు నినియోగిస్తారు . మార్చి 10 నుంచి 20 వ తేదీ వరకు వీరి సేవలు అందుతాయి . ఈ సేవకులకు లాటరి పద్ధతిలో సేవ ప్రదేశాలను కేటాయిస్తారు . నేటి మధ్యాహ్నం సమావేశంలోనే సేవకుల చేతుల మీదుగానే లాటరీ ప్రక్రియ చేపట్టారు .