శ్రీశైలం దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఐదో రోజు శనివారం అద్బుత కార్యక్రమాల ఆవిష్కరణ జరిగింది .రావణ వాహన సేవ , రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ ఈ రోజు ప్రత్యేకం . మంత్రి మాణిక్యాల రావు శ్రీశైల సందర్శనలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు . దేవస్థానం కార్యనిర్వహణాధికారి భరత్ ఇతర అధికారులు స్వాగతం పలికారు .ఈ రోజు విశేష పూజలు జరిగాయి . రావణ వాహన సేవలో శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి మండపంలో రావణ వాహనం పై వేంచేపు చేయించి ప్రత్యేక పూజలు జరిపారు . శ్రీశైల క్షేత్ర ప్రధాన దారుల్లో గ్రామోత్సవం జరిపారు . దేవస్థానంలోని భారత్ గ్యాస్ గోడౌన్ పక్కన ఏర్పాటు చేసిన నూతన పెట్రోల్ బoక్ ను దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాల రావు ప్రారంభించారు . మంత్రి రింగ్ రోడ్ ను పరిశీలించారు . ఈ.ఓ. వివరాలు చెప్పారు . రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఈ రోజు శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు . ఆలయ రాజగోపురం వద్ద వస్త్రాలకు ప్రత్యేక పూజలు జరిపారు . అనంతరం మేళ తాళాలతో ఆలయ ప్రవేశం చేసారు . అనంతరం వస్త్ర సమర్పణ చేసారు . సాయంత్రం సంప్రదాయ నృత్యాలు జరిగాయి . భక్తి సంగీత విభావరి బాగా ఆకట్టుకుంది . పార్థసారథి , గాయత్రి , చరణ్ తదితరులు పాల్గొన్నారు . ఈ కళాకారులకు ఈ.ఓ . సన్మానం చేసారు