శ్రీశైలంలో అద్భుతం-కన్నుల విందుగా కుంభోత్సవం. మంగళవారం ఉదయం శ్రీశైల దృశ్యం ఇది . భక్తులు విశేషంగా , ఉత్సహంగా ఈ ఘన కార్యక్రమంలో పాల్గొన్నారు . లోకకల్యాణార్థం జరిపిన ఈ అలౌకిక ఘటనలో భక్తులు పాల్గొని తరించారు . కొబ్బరికాయలు , నిమ్మకాయలు , గుమ్మడికాయలు ఎన్నెన్నో వినియోగించారు . అర్చక స్వాములు ప్రత్యేక పూజలు జరిపారు .అమ్మవారి ఆలయంలో చక్కని ముగ్గులు వేసి విశేష పూజలు జరిపారు .
అమ్మవారి ప్రదక్షిణ మండపంలో అర్చక స్వాములు , వేదపండితులు సాత్విక బలి సమర్పించారు . ఎదురుగా సింహం మంటపం వద్ద సిబ్బంది , భక్తులు సాత్విక బలి సమర్పించారు . కోటమ్మ వారికి సాత్విక బలి సమర్పించారు .