×

శివానందలహరి ఓ చక్కని మనస్తత్వ శాస్త్రం

శివానందలహరి ఓ చక్కని మనస్తత్వ శాస్త్రం

శివానందలహరి ఓ చక్కని మనస్తత్వ శాస్త్రం, పరిపరి విధాల వ్యవహరించే మనసును శివభక్తితో  చక్కదిద్దుకోవాలని ,ఇది ఆదిశంకరుల సందేశమని ప్రవచన కర్త సామవేదం షణ్ముఖ శర్మ పేర్కొన్నారు. శ్రీశైల దేవస్థానంలో శివానందలహరి పై ఆదివారం నాల్గవరోజు సామవేదం ప్రవచనం కొనసాగింది.దేవస్థానంలో పదవీవిరమణ చేసిన టి.వెంకటేశ్వర్లకు ఈ  సందర్భంగా ఆత్మీయ సత్కారం జరిగింది. పీఆర్ ఓ శ్రీనివాసరావు ,సామవేదం తదితరులు సత్కరించారు .  అచ్చమైన భక్తుడు శివుడితో తాదాత్మ్యం చెందితే  ఇహం లోనే పరాన్ని , జీవితంలోనే మోక్షం పొందగలరని సామవేదం అన్నారు.త్రికరణాలు శివమయం చేయాలని , అలాంటి వారిపై శివ కృపాకటాక్షం ఉంటుందని చెప్పారు.ఆదివారం కుమారస్వామి పూజలు, సామూహిక అభిషేకాలు ఘనంగా జరిగాయి.కళారాధనలో  శ్రీమతి  ఎ.ఎం.వై .కుమార్  ప్రేరణ ప్రతిభ మ్యూజికల్ ,  డాన్స్ ( హైదరాబాద్ ) వారు భరతనాట్య ప్రదర్శన సమర్పించారు.

print

Post Comment

You May Have Missed