శిఖరేశ్వరం వద్ద అభివృద్ధి పనులకు ఈ ఓ కొత్త ఆదేశాలు
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈ రోజు 27 న శిఖరేశ్వరం ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ (Pilgrimage Rejuvenation and Spiritual Augmentation Drive) పథకం క్రింద శిఖరేశ్వర ఆలయం వద్ద పుష్కరిణి జీర్ణోద్ధరణ, యాత్రికుల సౌకర్య కేంద్ర నిర్మాణం ( pilgrims amenities center ) ర్యాంప్ నిర్మాణం, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, ఆలయంలో రాతి బండపరుపు, వాచ్ టవర్ నిర్మాణం మొదలైన పనులు చేసారు.ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ఆరు అంతస్తులుగా నిర్మించిన వాచ్ టవర్ లో ప్రతి అంతస్తులోను ఎనిమిదివైపులా కూడా సేఫ్టీ గ్రిల్స్ ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించి, వెంటనే తదనుగుణంగా పనులు చేపట్టాలని కార్యనిర్వాహక ఇంజినీరును ఆదేశించారు.
సుందరీకరణలో భాగంగా వాచ్ టవర్ పై అంతస్తులో తగు విధంగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని కూడా కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. శిఖరేశ్వర ఆలయం వద్ద గతంలో నెలకొల్పిన విద్యుత్ శివలింగానికి అవసరమైన మరమ్మతులు చేసి లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.దర్శనానంతరం భక్తులు సేదతీరేందుకు వీలుగా శిఖరేశ్వర ఆలయ ప్రాంగణం చుట్టూ ( మూడు వైపులా ) ఉద్యానవనాన్ని పెంచేందుకు వెంటనే తగు ప్రణాళికను రుపొందించవలసిందిగా ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు.శిఖరేశ్వర ఆలయం వద్ద అవసరం మేరకు మరిన్ని మార్గ సూచికలను (ఫ్లెక్సి బోర్డులను ) ఏర్పాటు చేయాలని శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.
ఊయలసేవ:
లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు ఊయల సేవను నిర్వహించింది.మూలనక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ సాయంకాలం ఊయల సేవ నిర్వహించారు. ప్రతి శుక్రవారం , పౌర్ణమి, మూలనక్షత్రం రోజులలో ఈ ఊయల సేవ జరుపుతారు.ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని . తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ చేసారు.అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు షోడశోపచార పూజ జరిపారు.ఆ తరువాత విశేషంగా అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్ర నామపూజలు, స్వామివారికి సహస్రనామార్చన పూజలు జరిగాయి. చివరగా ఊయల సేవ జరిపారు.ఊయల సేవను పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు చేసారు.పుష్పాలంకరణకు గాను పలుపుష్పాలు వినియోగించారు. అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ ఈ ఊయలసేవను నిర్వహించారు.
Post Comment