×

శాస్త్రోక్తంగా ఊయలసేవ

శాస్త్రోక్తంగా ఊయలసేవ

 శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు సాయంకాలం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయలసేవను నిర్వహించింది .ప్రతి శుక్రవారం , పౌర్ణమి, మూలనక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ నిర్వహిస్తున్నారు.ఈ సాయంత్రం గం. 7.30ల నుండి ఈఊయలసేవ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని , తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ పూర్తి  చేసారు.అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా  షోడశోపచార పూజ జరిగింది.ఆ తరువాత విశేషంగా అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్ర నామపూజలు, స్వామివారికి సహస్రనామార్చన పూజలు నిర్వహించారు. చివరగా ఊయలసేవ జరిగింది.ఊయలసేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపించారు.

print

Post Comment

You May Have Missed