శ్రీశైలం అమ్మవారికి శాకాంబరి ఉత్సవ ఏర్పాట్లు చేసారు . ఆషాడ పౌర్ణమి న జరిగే ఈ కార్యక్రమానికి 35 రకాలకు పైగా ఆకుకూరలు , కూరగాయలు వివిధ రకాలు ఫలాలు తెప్పించారు .పలువురు విరాళంగా సమర్పించారు . 15 టన్నుల మేర ఆకుకూరలు , కూరగాయలు వినియోగిస్తారు. అమ్మవారికి విశేష పూజలు చేస్తారు .అమ్మవారి మూలమూర్తిని విశేషంగా అలంకరిస్తారు . ప్రాంగణాన్ని కూడా అలంకరిస్తారు . ఉత్సవ అనంతరం కదంబ ప్రసాద వితరణ చేస్తారు. పరాశక్తి స్వరూపామే శాకాంబరీ దేవిగా భావిస్తారు . కాగా గురువారం సామూహిక అభిషేకాలు ఘనంగా జరిగాయి .