గజ్వేల్ మండలం గిరిపల్లిలో మంగళవారం రాత్రి పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘కనువిప్పు’ అనేపేరుతో కళాజాత నిర్వహించారు. మూఢనమ్మకాలు,బాల్య వివాహాలు,వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలు,మద్య పానం వంటివి సమాజానికి, కుటుంబాలకు కలిగిస్తున్న దుష్ఫలి తాలను కళాకారులు తమ కళారూపాల ద్వారా ప్రదర్షించారు. గ్రామస్థులను జాగృతం చేసిన ఈ కళాజాత కార్యక్రమానికి గజ్వేల్ సీఐ ప్రసాద్, ఎస్సై కమలాకర్, సర్పంచ్ జనార్దన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా సిఐ ప్రసాద్ గ్రామస్తులను కోరారు. -చైతన్య ,గజ్వేల్