శాంతంతో అన్నీ సాధ్యాలు -బ్రహ్మశ్రీ వద్దిపర్తికి ఘన సన్మానం

శాంతంతో  అన్నీ సాధ్యమేనని , కోపంతో అన్నీ  ఇబ్బందులేనని  బ్రహ్మశ్రీ  వద్దిపర్తి  పద్మాకర్   అన్నారు.  శ్రీశైలంలో  అర్ధనారీశ్వర తత్త్వంపై  పద్మాకర్  ప్రవచనాలు  సోమవారంతో ముగిసాయి.   శ్రీశైలం కరుణ శైలమని  ఇక్కడ  భక్తితో సేవిస్తే  స్వామి అమ్మవార్ల అనుగ్రహం  లభిస్తుందన్నారు. భీముడు  ఈ క్షేత్రంలో దర్శనానికి వచ్చినప్పుడు  ఆకలి తీరడానికి శివస్తోత్రం చేశాడని , అమ్మవారు కిరాత స్త్రీ రూపంలో దర్శనం ఇచ్చి ఆహారం పెట్టిందని బ్రహ్మశ్రీ  పేర్కొన్నారు. భీముడు కడుపునిండా తిని అమ్మ ఆజ్ఞపై   శివలింగాన్ని ప్రతిష్టించాడని ,  ఆ లింగాన్ని దర్శించినవారికి జీవితంలో ఆహారానికి లోటు ఉండదని  వివరించారు. అర్జునుడికి పాశుపతం  ఇచ్చింది అర్ధనారీశ్వరుడని పేర్కొన్నారు.శ్రీశైలంలో  బిల్వ మొక్కలను నాటినవారికి  ప్రమధగణాలలో  చోటు లభిస్తుందన్నారు. బ్రహ్మశ్రీ  పద్మాకర్ గత  వారం రోజుల  ప్రవచనంలో  శివతత్త్వం ,   శివలీలవైభవం , శివరూప విశేషాలు , దేవీతత్త్వం , దేవీమహాత్యం , శ్రీశైల క్షేత్ర మహిమలు  తదితర  విశేషాలు పేర్కొన్నారు.  ఈ ప్రవచనం ఘనంగా ముగిసిన గుర్తుగా  దేవస్థానం వారు , అభిమానులు బ్రహ్మశ్రీ పద్మాకర్ ను ఘనంగా సన్మానించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.