వ్యవసాయ రంగానికి పెద్ద మొత్తం లో నిధులు
రాష్ట్ర అభివృద్దికి వ్యవసాయ రంగభివృద్ది అనివార్యమని గుర్తించిన ప్రభుత్వం,వ్యవసాయ రంగానికి పెద్ద మొత్తం లో నిధులు కేటాయించిందని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖా మాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు . తెలంగాణా వ్యవసాయ అధికారుల సంఘం ఆర్ బి వి ఆర్ ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆడిటోరియం లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమం లో పాల్గొని మాట్లాడారు . రాష్ట్రం సాధించేన్తవరకు నీరు పారే ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాల రైతాంగం కష్టాలలో వుండేవారు . స్వపరిపాలన లో నే అభివృద్ధి సాధ్యమని గుర్తించి రాష్ట్రాన్ని సాధించుకున్నమన్నారు . రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణా రైతాంగం ఇతర ప్రాంత రైతులకు ఆదర్శంగా నిలుస్తునారు . ఆధునిక పోకడల తో వేల సంవత్సరాల వ్యవసాయ రంగాన్ని పక్కన పెట్టారు . ప్రస్తుతం ప్రాముఖ్యతని గుర్తించి చాలామంది మళ్ళి ఈ రంగం పట్ల ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.
-తెలంగాణా వ్యవసాయ అధికారుల సంఘం ఆధ్వర్యం లో నిర్వహించిన కార్యక్రమం లో మంత్రి పాల్గొని 2020 ఆంగ్ల సంవత్సర డైరీ ,క్యాలెండరు ,టేబుల్ క్యాలెండరు ఆవిష్కరించారు . ఈ సందర్బంగా తెలంగాణా వ్యవసాయ అధికారుల సంఘం ఆధ్వర్యం లో ఐదు కేటగిరి ల లో ఉత్తమ రైతులకు రైతు రత్న అవార్డులను బహుకరించారు . లావణ్య ,మల్లేష్, రానా ప్రతాప్ , దామోదర్ రెడ్డి ,ప్రవీణ్ కుమార్ రెడ్డి ,రావిసాగర్ లు రైతు రత్న అవార్డును పొందారు . కార్యక్రమం లో అధికారుల సంఘ సభ్యులు కే .అనురాధ ,కృపాకర్ రెడ్డి ,శ్యామసుందర్ రెడ్డి ,విజయ కుమార్ ,వ్యవసాయ శాఖాధి కారులు ,వివిధ జిల్లాల నుండి వచ్చిన రైతులు పాల్గొన్నారు .
Post Comment