వ్యక్తిగత జాగ్రత్తలతో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు

కరోనా  వైరస్ పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు సమాచార పౌరసంబంధాల శాఖ ప్రధాన కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్య నిపుణులు మాట్లాడారు.కరోనా వైరస్ ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అని ఉస్మానియా జనరల్  ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీల్ కుమార్ అన్నారు.దాదాపు 220 దేశాలలో వైరస్ వ్యాప్తి చెందిందన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం లో వైరస్ వ్యాప్తి, మరణాల శాతం చాలా తక్కువ గా ఉందన్నారు. లాక్ డౌన్ వలన వైరస్ వ్యాప్తి చాలా వరకు తగ్గించ గలిగామన్నారు. భౌతిక దూరం పాటిస్తూ తరచుగా చేతులు కడుక్కుంటే వైరస్ వ్యాప్తి ని చాలా వరకు తగ్గించవచ్చునన్నారు.వాక్సిన్ ఇంకా ట్రయల్స్ దశ లొనే ఉందని అందరూ జాగ్రత్తగా ఉండేందుకు కృషి చేయాలని సూచించారు.

కన్సల్టెంట్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ లాక్ డౌన్ తర్వాత నార్మల్ లైఫ్ లోకి వచ్చేటప్పుడు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని సూచించారు.డయాబెటిస్ , బీపీ తో బాధపడే వారు విధిగా ఇంటిలోనే వుంటూ మానిటర్ చేసుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. ఇంకా సమస్య కొనసాగితే డాక్టర్ను సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. వీలయినంత వరకు టెలి మెడిసిన్ సౌకర్యాన్ని వినియోగించు కోవాలన్నారు.గర్భిణులు, చంటి పిల్లల లో తగు చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టర్ సలహా లేకుండా ఎటువంటి మందులు వాడకూడదన్నారు. పని ప్రదేశాలలో తప్పకుండా భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. అనవసరం గా గుంపులలో కి వెళ్లకూడదని  సూచించారు.ప్రభుత్వం ఇస్తున్న సూచనలు, సలహాలను విధి గా పాటిస్తూ  ఆరోగ్యం గా ఉండాలన్నారు.

సమావేశం లో అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, జాయింట్ డైరెక్టర్  జగన్ ,సీఐఇ విజయభాస్కరరెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ యామిని తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed