నెల్లూరు : వైయస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైయస్‌ఆర్ రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతు భరోసా పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన స్టాళ్లను సీఎం వైయస్ జగన్ పరిశీలించారు.