రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్ లోని ఆసుపత్రులకు ప్రభుత్వం కొత్తగా 4,540 పోస్టులు మంజూరు చేసింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలకు సీఎం శనివారం ఆమోదం తెలిపారు. ప్రస్తుత వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఏరియా ఆసుపత్రుల్లో కొత్తగా 3,900 పోస్టులు అవసరం కాగా, అప్ గ్రేడ్ చేసిన 13 ఏరియా ఆసుపత్రుల్లో మరో 640 పోస్టులు అవసరమని అధికారులకు సీఎంకు నివేదించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని పెంచాల్సి ఉన్నందున వెంటనే ఈ నియామకాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.