పోషణ్ అభియాన్ లో భాగంగా 31 జిల్లాల్లో డా. బి.ఆర్.అంబేత్కర్ జయంతి నుంచి 24 ణ జాతీయ పంచాయితీ రాజ్ దివస్ వరకు ప్రజల భాగస్వామ్యం కోసం ప్రతి గ్రామం లో 14 న గ్రామ సభ నిర్వహిస్తారు .గ్రామాల్లో పిల్లలు, తల్లుల పోషణ స్థాయి పెంచడానికి రానున్న మూడు సంవత్సరాలలో లక్ష్యాలను నిశ్చయించి , అమలు కోసం పంచాయితీ రాజ్, ఆరోగ్య, పారిశుధ్య శాఖల సమన్వయంతో ఈ కార్యక్రామాన్ని చేపడుతారు .
పోషణ అభియాన్ ను ప్రధానమంత్రి మార్చి 8, 2018 న ప్రారంచారు . ఈ మిషన్ క్రింద మొదటి విడతగా తెలంగాణా లో 10 జిల్లాలలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మహబూబ్నగర్, గద్వాల్ , వనపర్తి, నాగర్ కర్నూల్, హైదరాబాద్, రంగారెడ్డి (మొత్తం 48 ప్రాజెక్ట్ లు, 10960 అంగన్వాడి కేంద్రాలలో) ప్రారంభించారు .
శుక్రవారం సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ విజయిందర్ బోయి తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోషణ అభియాన్ కార్యక్రమం కోసం ప్రతి గ్రామంలో గ్రామ సభలు జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.