విస్తృతంగా మొక్కలను నాటాలని శ్రీశైల దేవస్థానం నిర్ణయం

శ్రీశైల దేవస్థానం: అటవీశాఖ ఫీల్డ్ డైరెక్టర్ తో సమావేశం:పర్యావరణ పరిరక్షణకు,  క్షేత్రాన్ని మరింతగా సుందరీకరించేందుకు విస్తృతంగా మొక్కలను నాటాలని దేవస్థానం నిర్ణయించింది.వర్షాకాలం ముగిసేలోగా భారీగా మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసారు.ముఖ్యంగా వలయ రహదారికి (రింగ్ రోడ్డు) యిరువైపులా, దేవస్థానం ఉద్యానవనాలలోనూ, ఆరుబయలు ప్రదేశాలలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇప్పటికే దేవస్థానం పలురకాల మొక్కలను సేకరించి సిద్ధం చేసారు. కాగా ఈ కార్యక్రమములో అటవీశాఖ సహకారాన్ని కూడా పొందాలని దేవస్థానం భావిస్తోంది.ఇందులో భాగంగా ఈ రోజు 4 న అటవీశాఖ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసరెడ్డితో కార్యనిర్వహణాధికారి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.శ్రీశైలం ప్రాజెక్టుకాలనీలోని ఫీల్డ్ డైరెక్టర్ కార్యాలయములో జరిగిన ఈ సమావేశములో దేవస్థానం చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం గురించి చర్చించారు.

 శ్రీశైల మహాక్షేత్రములో  ఉద్యానవనాలు, దేవస్థానం నిర్వహిస్తున్న నర్సరీ, పూలతోటలు మొదలైన వాటి గురించి కార్యనిర్వహణాధికారి ఫీల్డ్ డైరెక్టర్ కు వివరించారు. ఇటీవల దేవస్థానం ఏర్పాటు చేసిన నక్షత్రవనం గురించి కూడా కార్యనిర్వహణాధికారి  వివరించారు.ప్రస్తుతం దేవస్థానం చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం ముఖ్యంగా వలయ రహదారికి యిరువైపులా మొక్కలునాటే కార్యక్రమం, ఆరుబయలు ప్రదేశాలలో పెంచనున్న మొక్కలు మొదలైనవాటి గురించి కూడా కార్యనిర్వహణాధికారి  వివరించారు.ఫీల్డ్ డైరెక్టర్  పలు సలహాలను అందించారు.వలయరహదారిలో నాటేందుకు అనువైన మొక్కలు, వాటి పరిరక్షణ, ఆరుబయలు ప్రదేశాలలో పెంచాల్సిన మొక్కలు, ఉద్యానవనాలలో ల్యాండ్ స్కేపింగ్ పద్ధతులు, వీటికి సంబంధించిన సాంకేతివిధానాలు మొదలైన వాటి గురించి ఫీల్డ్ డైరెక్టర్  వివరించారు.ఈ సమావేశములో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.మురళీ బాలకృష్ణ, హార్టికల్చరిస్ట్ లోకేష్ తదితరులు కూడా పాల్గొన్నారు.

 శ్రీశైల దేవస్థానం:అమ్మవారికి పల్లకీసేవ:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు  రాత్రి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి పల్లకీ ఉత్సవం నిర్వహించింది.ఈ మధ్యాహ్యనానికే పౌర్ణమి ఘడియలు రావడంతో , మూలానక్షత్రం ఉండడంతో ఈ పల్లకీసేవ జరిపారు.

. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి,  మూల నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) జరుపుతారు.ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్నితరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరుపుతారు.అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు  షోడశోపచారపూజలు చేసారు. తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీలో వేంచేబు చేయించి పల్లకీ ఉత్సవం చేసారు.

 శ్రీశైల దేవస్థానం:| ఊయలసేవ:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు  సాయంకాలం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయలసేవను నిర్వహించింది.ఈ మధ్యాహ్యనానికే పౌర్ణమి ఘడియలు రావడంతో,  మూలానక్షత్రం ఉండడంతో ఈ ఊయలసేవ జరిపారు.ప్రతి శుక్రవారం,  పౌర్ణమి, మూలనక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ ఉంటుంది.ఈ సాయంత్రం గం. 8.00ల నుండి ఈ

ఊయల సేవ జరిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ చేసారు.అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు షోడశోపచార పూజ చేసారు.ఆ తరువాత విశేషంగా అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్ర నామ పూజలు, స్వామివారికి సహస్రనామార్చన పూజలు జరిపారు. చివరగా ఊయల సేవ జరిగింది.ఊయల సేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు చేసారు.

print

Post Comment

You May Have Missed