విశాఖపట్నం: విశాఖ ఉత్సవ్‌ను సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ‘మీ అందరి ఆప్యాయతలు, ప్రేమానురాగాల మధ్య ఈ రోజు విశాఖ ఉత్సవాలను ప్రారంభిస్తున్నామని సీఎం చెప్పారు. సీఎం వైయస్ జగన్ రాకతో ఆర్కే బీచ్ జనసంద్రమైంది. ఈ ఉత్సవ్ రెండు రోజుల పాటు కొనసాగనుంది. అంతకుముందు లేజర్ షో ద్వారా దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర, వైయస్‌ఆర్ సువర్ణ పాలన, మహానేత స్ఫూర్తితో ఆయన ఆశయ సాధనకు జననేత వైయస్ జగన్ చేపట్టిన 3648 కిలోమీటర్ల పాదయాత్ర, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత సీఎం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు, విశాఖ నగరంలోని మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, రైల్, రోడ్డు కనెక్టివిటీని సీఎం వైయస్ జగన్ చిత్రం, ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌లో ప్రదర్శించారు. ఈ లేజర్ షోను సీఎం వైయస్ జగన్ తిలకించారు.
కైలాసగిరిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి డాక్టర్ వైయస్‌ఆర్ సెంట్రల్ పార్కు చేరుకున్నారు. పార్కులో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జీవీఎంసీ ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో సందర్శించారు. ఆ తరువాత జీవీఎంసీ చేపట్టే రూ.905.05 కోట్ల పనులకు సెంట్రల్ పార్కులో సీఎం వైయస్ జగన్ శంకుస్థాపనలు చేశారు. రూ. 433 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి పనులకు, రూ. 52 కోట్లతో మున్సిపల్ స్కూళ్లలో నాడు – నేడు కార్యక్రమానికి, రూ. 109 కోట్లతో ఆర్కే బీచ్ అభివృద్ధి పనులకు, రూ. 9.5 కోట్లతో ముడసరలోవ రిజర్వాయర్ అభివృద్ధి పనులకు, రూ. 145 కోట్లతో స్మార్ట్ సిటీ పనులకు, రూ. 157 కోట్లతో అమృత్ వర్క్స్‌కు సీఎం వైయస్ జగన్ శంకుస్థాపనలు చేశారు.
విశాఖ ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు వైయస్‌ఆర్ సీపీ శ్రేణులు, ఉత్తరాంధ్ర వాసులు ఘనస్వాగతం పలికారు. పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సీఎంను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. సీఎం స్వాగతం పలికేందుకు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనం విశాఖకు తరలివచ్చారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రతిపాదించిన తరువాత మొదటిసారి విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి కృతజ్ఞతాపూర్వకంగా జనమంతా స్వాగతం పలికారు.