
భారతరత్న, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి మృతిపట్ల ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలో విలువలతో కూడిన రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి అటల్ జీ అన్నారు. బడి ఈడు పిల్లలు పాఠశాలల్లో ఉండాలనే లక్ష్యంతో సర్వ శిక్ష అభియాన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి స్కూల్ డ్రాప్ అవుట్స్ తగ్గడానికి కృషి చేసిన ప్రధాన మంత్రిగా ఎప్పటికి నిలిచిపోతారన్నారు. ఈతరం రాజకీయాలకు ఆయనొక స్ఫూర్తి ప్రదాత అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.