శ్రీశైలం దేవస్థానం పరిధిలోని విభూది మఠం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఆదివారం రాళ్ళను తొలగిస్తున్న సమయంలో రక్షా రేకుల్లాంటి రాగి రేకుల యంత్రాలు బయటపడ్డాయి . దేవస్థానం వారు స్థానిక రెవిన్యూ, పోలీస్ అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకువెళ్ళారు . దేవస్థాన కార్యనిర్వహణ అధికారి, ఉభయ మఠాల ప్రధాన అర్చకులు ,స్థానికులు చేరుకున్నారు. ఎస్.ఐ. వరప్రసాద్, విఆర్వో నాగచంద్రుడు తదితరులు మఠం వద్దకు చేరుకొని రాగి యంత్రాలను పరిశీలించారు.